2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పుడిప్పుడే ప్రాణం వస్తోంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి జట్లు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించాయి... దీంతో మళ్లీ పాత రోజులు వస్తాయని భావించింది పాకిస్తాన్...
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆగస్టులో పాక్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగాల్సింది. అయితే పాకిస్తాన్‌లో టీమిండియా అడుగుపెట్టే ప్రసక్తి లేదని, తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించాడు...
ఈ వ్యాఖ్యలతో పీసీబీకి ఊహించని షాక్ తగిలింది.
‘ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్ నుంచి తరలించే ఊరుకోం. అవసరమైతే ఈ విషయాన్ని ఐసీసీకి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్లు ఆసియా కప్ కోసం పాక్‌కి రాకపోతే, మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోం...’ అంటూ సంచలన ప్రకటన చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
‘బీసీసీఐ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించే శక్తి. వాళ్లు చేయగలిగింది వాళ్లు చేశారు. అయితే పీసీబీ, బీసీసీఐకి ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగిలిన అన్ని బోర్డులు, బీసీసీఐ ఏం చెబితే దానికి ఒప్పుకుంటాయి...
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాలే... బీసీసీఐని కాదని ఏమీ చేయలేవు. ఎందుకంటే బీసీసీఐ చాలా చాలా శక్తివంతమైన బోర్డు. వాళ్లు తలుచుకుంటే పాక్ క్రికెట్ జట్టునే లేకుండా చేయగలరు...
పాక్‌తో ఏ జట్టూ క్రికెట్ ఆడకుండా చేయగలరు. ఇరుదేశాల మధ్య రాజకీయ సంబంధాలు సరిగ్గా లేనప్పుడు పాకిస్తాన్‌కి వాళ్లు రావాలని పట్టుబట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో స్థాయి తెలుసుకుని వ్యవహరించాలి...
ఓ తటస్థ వేదికపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అధికారులు సమావేశమై దీనిపై చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...