అయితే పనిలో పనిగా పాకిస్తాన్ క్రికెట్ మీద, కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద, పీసీబీ, ఇతర సిబ్బంది మీద రాళ్లేయడం వీరికి ఆనవాయితీగా మారింది. వీళ్లు, వాళ్లు అని తేడా లేకుండా అందరూ ఈ రకమైన ధోరణికి అలవాటుపడ్డారు. ఏదైనా ఇష్యూ జరిగితే యూట్యూబ్ లోకి రావడం దాని గురించి విశ్లేషణ అని ఊదరగొట్టడమే వీళ్ల పనిగా మారింది.