అశ్విన్, కుల్దీప్ కాదు.. ఆ స్పిన్నర్‌ను చూసి వణికిపోతున్న ఆస్ట్రేలియా.. వీడియోలు తెెప్పించి మరీ ప్రాక్టీస్..

First Published Feb 2, 2023, 5:03 PM IST

Border-Gavaskar Trophy: గత పర్యటనలలో ఆస్ట్రేలియాను  రవిచంద్రన్ అశ్విన్  బాగా దెబ్బతీశాడు. ఇటీవల కాలంలో  కుల్దీప్ యాదవ్ కూడా  మంచి ప్రదర్శనలతో  రెచ్చిపోతున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడబోయే భారత జట్టులో ఉన్నారు. 

సుదీర్ఘకాలంగా భారత్ లో  టెస్టు సిరీస్ గెలవలేకపోతున్నామనే  లోటుతో ఉన్న  ఆస్ట్రేలియా.. తాజాగా  టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు  ఇండియాలో అడుగుపెట్టింది.  ఇదివరకే భారత్ కు చేరుకున్న  ఆసీస్ ఆటగాళ్లు బెంగళూరులో  స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పిన్ కు అనుకూలించే ఉపఖండపు పిచ్ లపై  స్పిన్నర్లను ఎదుర్కునేందుకు వాళ్లు  కఠోర  సాధన చేస్తున్నారు. 

Image credit: Getty

గత పర్యటనలలో ఆస్ట్రేలియాను  రవిచంద్రన్ అశ్విన్  బాగా దెబ్బతీశాడు. ఇటీవల కాలంలో  కుల్దీప్ యాదవ్ కూడా  మంచి ప్రదర్శనలతో  రెచ్చిపోతున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడబోయే భారత జట్టులో ఉన్నారు.  అయితే  ఈ ఇద్దరి కంటే  కూడా ఆస్ట్రేలియా మరో స్పిన్నర్ ను చూసి భయపడుతోందట.. 

ఆ స్పిన్నర్ మరెవరో కాదు. ఇటీవలే  పెళ్లి చేసుకున్న  టీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్.   స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై  అక్షర్   అదరగొట్టగలడు. గతంలో ఇంగ్లాండ్ స్వదేశానికి వచ్చినప్పుడు అక్షర్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు.   ఆసీస్ కు కూడా ఇప్పుడు అక్షర్ ఫీవర్ పట్టుకుంది. 

మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా  క్రికెట్ జట్టు బెంగళూరుకు చేరాక  ప్రాక్టీస్ తో పాటు  అక్షర్ పటేల్ గతంలో ఆడిన టెస్టులు, పడగొట్టిన వికెట్లకు సంబంధించిన వీడియోలను పదే పదే చూస్తోందట.  ఆ వీడియోలను ప్రత్యేకంగా తెప్పించుకుని  అక్షర్ ను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించిందట.. 

2021లో  ఇంగ్లాండ్ తో టెస్టులో అరంగేట్రం చేసిన అక్షర్..  తన కెరీర్ లో ఇప్పటివరకు 8 టెస్టులు ఆడాడు.  8 టెస్టులలో 36 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన ఐదు సార్లు చేయగా ఒక మ్యాచ్ లో పది వికెట్ల ప్రదర్శన కూడా ఒకసారి  నమోదుచేశాడు. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్,  కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుద్లీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ 

click me!