మగాళ్లకే సాధ్యం కాని రికార్డులు కొట్టిన మహిళా క్రికెటర్లు... ఈ లెక్కలు చూసి షాక్ అవ్వాల్సిందే...

First Published Feb 2, 2023, 5:27 PM IST

క్రికెట్‌‌ని జెంటిల్మెన్ గేమ్ అంటారు. పేరులో మెన్ ఉన్నట్టే క్రికెట్ వరల్డ్‌లో పురుషాధిక్యం చాలా ఎక్కువ. పురుష క్రికెటర్లకు చెల్లించే దాంట్లో సగం కూడా మహిళా క్రికెటర్లకు దక్కదు. ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే క్రికెట్ ప్రపంచంలో మగాళ్లకు కూడా సాధ్యం కాని రికార్డులు, మహిళా క్రికెటర్లు నమోదు చేశారంటే నమ్ముతారా... అవును. ఇది నిజం...

Smriti Mandhana-Harmanpreet Kaur

అప్పుడెప్పుడో 35 ఏళ్ల క్రితం పురుషుల కోసం అండర్19 వరల్డ్ కప్ నిర్వహించిన ఐసీసీ, ఈ ఏడాది మహిళల కోసం టీ20 ఫార్మాట్‌లో అండర్19 ప్రపంచకప్‌ని తీసుకొచ్చింది. అయితే మొట్టమొదటి వరల్డ్ కప్ మాత్రం పురుషులది కాదు, మహిళలది. 1973లో మొట్టమొదటి ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ జరిగింది. ఇది జరిగిన రెండేళ్లకు 1975లో మెన్స్ వరల్డ్ కప్ టోర్నీ మొదలైంది... అంటే పురుషల కంటే మహిళలు రెండేళ్లు ముందుగానే ఉన్నారన్నమాట...

చాలామంది మహిళల క్రికెట్ చూడకపోవడానికి వాళ్లు చాలా స్లోగా ఆడతారని కారణంగా చెబుతారు... అయితే వన్డే క్రికెట్‌లో 450+ స్కోరు మొట్టమొదటగా నమోదు చేసింది మహిళా జట్టే. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. 1996లో కివీస్ మహిళా జట్టు ఈ స్కోరు చేయగా 2018 వరకూ ఈ రికార్డు ఏ మెన్స్ టీమ్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. 2018లో ఆస్ట్రేలియాపై 481 పరుగులు చేసిన ఇంగ్లాండ్ పురుషుల జట్టు, 2022లో నెదర్లాండ్‌తో మ్యాచ్‌లో 498 పరుగులు చేసింది.. 

Amelia Kerr

అతి పిన్న వయసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్ కూడా ఓ మహిళే. న్యూజిలాండ్ క్రికెటర్ అమిలియా కేర్, 17 ఏళ్ల వయసులో 232 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు జావెద్ మియాందాద్ పేరిట ఉంది. పాక్ మాజీ కెప్టెన్ మియాందాద్ 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ బాదాడు. అంటే పురుషుల క్రికెటర్ కంటే రెండేళ్లకు ముందే మహిళా క్రికెటర్ డబుల్ బాదేసింది...

వన్డే ఫార్మాట్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అనుకుంటారు చాలామంది. అయితే సచిన్‌కి టెండూల్కర్‌ 2009లో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదితే, ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిందా క్లార్క్, 1997 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో డెన్మార్క్‌పై 229 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచింది...
 

టెస్టుల్లో 10 వికెట్లు తీయడం, సెంచరీ చేయడం చాలా గొప్ప ఘనత. ఆల్‌రౌండర్ల యుగంలో ఈ ఫీట్ చాలా కామన్‌ అయిపోయింది. అయితే 1958లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్, ఒకే టెస్టులో 10 వికెట్లు తీసి, 100కి పైగా పరుగులు చేసి... ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచింది..
 

click me!