గెలిచినా, గెలవకపోయినా దాన్ని సెట్ చేసుకోండి... వన్డే వరల్డ్ కప్‌పై సురేష్ రైనా కామెంట్స్...

First Published Sep 18, 2023, 11:11 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు దక్కిన ఈ భారీ విజయం, టీమ్‌లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా...

సెప్టెంబర్ 22న మొహాలీలో మొదటి వన్డే, ఇండోర్‌లో సెప్టెంబర్ 24న రెండో వన్డే, సెప్టెంబర్ 27న మూడో వన్డే ఆడతాయి ఇండియా - ఆస్ట్రేలియా.. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకుని వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు ఆడుతుంది భారత జట్టు..


సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 వార్మప్ మ్యాచులు ఆడుతుంది టీమిండియా.. ఆ తర్వాత అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ ఆడనుంది..

‘ఆసియా కప్ విజయం టీమ్‌లో మంచి జోష్ నింపింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిరీస్‌ని 3-0 తేడాతో గెలిచినా, 3-0 ఓడినా పెద్దగా తేడా ఉండదు..
 

కాబట్టి గెలవడం కంటే ముఖ్యంగా టీమ్ కాంబినేషన్ మీద ఫోకస్ పెట్టండి. వరల్డ్ కప్‌లో ఏం చేస్తే వర్కవుట్ అవుతుందో తెలుసుకోవడానికి ఎన్ని ప్రయోగాలు అవసరమైతే అన్నీ చేసేయండి. బ్యాటింగ్ ఆర్డర్‌లో మన దగ్గర కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి..
 

Shardul Thakur

లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో వరల్డ్ కప్‌లో శార్దూల్ ఠాకూర్ కీ ప్లేయర్ అవుతాడు. మహ్మద్ షమీ వేసే స్వింగ్ బాల్స్, యార్కర్స్ మ్యాచ్‌ని మలుపు తిప్పగలవు. 
 


ఆసీస్ టీమ్‌లో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ. కాబట్టి జడ్డూ కూడా బౌలింగ్‌లో అదరగొట్టేయొచ్చు. ఇండోర్ గ్రౌండ్ చాలా చిన్నది. రాజ్‌కోట్‌లో బ్యాటింగ్‌ పిచ్ ఉంటుంది. మొహాలీలో ఆస్ట్రేలియాకి చాలా మ్యాచులు ఆడిన అనుభవం ఉంది..

ఎలా చూసినా ఆస్ట్రేలియా ఈసారి పక్కా ప్లానింగ్‌తో రాబోతోంది. వన్డే వరల్డ్ కప్‌కి ముందు వన్డే సిరీస్ కావడంతో వాళ్లు కూడా టీమ్ కాంబినేషన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. వరల్డ్ కప్ ప్రిపరేషన్‌గానే ఈ సిరీస్‌ని చూస్తారు. కాబట్టి వాళ్లను తక్కువ అంచనా వేయకపోవడం చాలా ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. 
 

click me!