గంగూలీని సైడ్ చేయడానికి కారణం ఇదేనా! బీసీసీఐ ప్రెసిడెంట్ ఉండగా, జై షా చేతుల మీదుగా...

First Published | Sep 17, 2023, 8:26 PM IST

ఏ రంగంలో అయినా ప్రోటోకాల్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. హై అథారిటీ ఉన్నప్పుడు వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిందే. అయితే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డులో మాత్రం ప్రోటోకాల్ అంతా వేరేగా నడుస్తోందని అంటున్నారు కొందరు టీమిండియా ఫ్యాన్స్...
 

ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో 8వ సారి టైటిల్ గెలిచింది టీమిండియా... మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. లంక 50 పరుగులకు ఆలౌట్ కాగా, ఈ టార్గెట్‌‌ని 6.1 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా..
 

ఫైనల్ మ్యాచ్‌కి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ భిన్నీతో పాటు సెక్రటరీ జై షా కూడా హాజరయ్యాడు. అయితే టైటిల్ గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ చేతులు మీదుగా కాకుండా సెక్రటరీ జై షా చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు..
 

Latest Videos


ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాతే సెక్రటరీ వస్తాడు. అలాంటిది బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ఉండగా జై షా, ట్రోఫీని అందించడం ఏంటని నిలదీస్తున్నారు కొందరు టీమిండియా ఫ్యాన్స్...
 

Siraj

బీసీసీఐలో అంతా జై షా చెప్పినట్టే నడుస్తోందని, రోజర్ బిన్నీ కేవలం నామమాత్రపు ప్రెసిడెంట్‌గా మాత్రమే మారడని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. జై షా ఆటలు సాగడం లేదనే ఉద్దేశంతోనే సౌరవ్ గంగూలీని, బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..

అయితే జై షా, ఆసియా కప్ ట్రోఫీని బహుకరించడానికి కారణం. ఆసియా కప్ అనేది ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన ట్రోఫీ. జై షా, బీసీసీఐ సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆ విధంగా ఏసీసీ ప్రోటోకాల్ ప్రకారం జై షా, ట్రోఫీ ఇవ్వడమే కరెక్ట్..

ఈ విషయం తెలియని చాలామంది, రోజర్ బిన్నీని కాదని జై షా ట్రోఫీ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఆసియా కప్ కాకుండా వేరే టోర్నీల్లో రోజర్ బిన్నీ ఉండగా జై షా ట్రోఫీ ఇస్తే మాత్రం అది కచ్ఛితంగా ప్రోటోకాల్‌ని అతిక్రమించడమే అవుతుంది. అందుకే ఐపీఎల్ 2023 ట్రోఫీని రోజర్ బిన్నీ, జై షా కలిపి ఇచ్చారు..

click me!