ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్, శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కి దూరమయ్యాడు. అక్షర్ పటేల్ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి అతను దూరమయ్యాడు..
‘అక్షర్ పటేల్ గాయం చిన్నదే. అతను కోలుకోవడానికి వారం లేదా 10 రోజుల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఒకవేళ అతను కోలుకోకపోతే మాత్రం అతని ప్లేస్‌లో వేరే ప్లేయర్‌ని తీసుకోవాలా? అనే దాని గురించి ఆలోచిస్తాం..
Image credit: Getty
శ్రేయాస్ అయ్యర్, ఆసియా కప్‌లో కొన్ని మ్యాచులు ఆడలేదు. అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లే రెస్ట్ ఇచ్చాం. అతను 99 శాతం ఫిట్‌గా ఉన్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఆశించిన పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాతే టీమ్‌కి సెలక్ట్ చేశాం..
స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ని వరల్డ్ కప్ ఆడించే ఆలోచన కూడా ఉంది. అతనితో ఈ విషయం గురించి ఫోన్‌లో మాట్లాడాం. అక్షర్ కుమార్‌కి ఆఖరి నిమిషంలో గాయం కావడంతో అందుబాటులో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ని ఆడించాం..
అతను ఫిట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఏషియన్ గేమ్స్ కోసం బెంగళూరులో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతీ ప్లేయర్, అవసరమైతే టీమ్ తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని అందరికి తెలియచేశాం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
నాలుగేళ్ల పాటు వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, లక్కీగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడాడు. ఆ తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ అశ్విన్‌కి అవకాశం దక్కింది.