'అలా చేసే ధైర్యం సెలెక్టర్లకు లేదు..' భారత జట్టు ఆటగాళ్లపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

First Published | Jan 9, 2025, 6:51 PM IST

Cricket: ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పేలవ ప్రదర్శన నేప‌థ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భార‌త జ‌ట్టు, దాని భవిష్యత్తుపై కొత్త చ‌ర్చ‌లు మొద‌ల‌వుతున్నాయి.
 

Cricket: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఎందుకంటే భార‌త జ‌ట్టు కోచ్ గా వ‌చ్చిన త‌ర్వాత విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న జ‌ట్టుకు బ్రేకులు ప‌డ్దాయి. వ‌రుస ఓట‌ముల‌తో భార‌త జ‌ట్టు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ది. కేవలం 6 నెలల్లోనే గంభీర్ కోచింగ్‌పై చాలా మరకలు పడ్డాయి.

Jasprit Bumrah-Gautam Gambhir

మనం కొన్నేళ్లు వెనక్కి వెళితే, గంభీర్ భారత జట్టును లక్ష్యంగా చేసుకుని తరచూ సెలెక్టర్లపై విమ‌ర్శ‌ల దాడి చేసేవాడు. ఆరేళ్ల క్రితం భారత జట్టు దేశవాళీ క్రికెట్ ల‌ ఆడుతోందని విమర్శించారు. ఇప్పుడు భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గా గౌత‌మ్ గంభీర్ వ‌చ్చిన త‌ర్వాత ఇప్పుడు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ల‌ను దేశ‌వాళీ క్రికెట్ ఆడ‌మ‌ని చెబుతున్నారు. అంటే భార‌త జ‌ట్టు ప‌రిస్థితి అత‌ను వ‌చ్చిన త‌ర్వాత ఎలా మారింద‌నేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే గంభీర్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 


Gautam Gambhir-Rohit-Kohli

రోహిత్-విరాట్ లు విఫ‌లం.. మ‌రి మిగ‌తా జ‌ట్టు?  

భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ సూపర్ ఫ్లాప్ కాగా, విరాట్ కోహ్లీ సెంచరీ సహాయంతో 190 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల నుంచి ఆశించిన స్థాయిలో ప‌రుగులు రాలేదు. దీంతో ఆసీస్ తో జ‌రిగిన ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ ను భార‌త్ కోల్పోవ‌డంతో టార్గెట్ గా మారారు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మలు టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకోవాల‌నే వాద‌న‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే, వీరిద్ద‌రూ ఫెయిల్ అయితే మిగ‌తా జ‌ట్టుకు ఏమైంద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. గౌతమ్ గంభీర్ జ‌ట్టులో లేనప్పుడు టీమిండియాతో పాటు సెల‌క్ష‌న్ క‌మిటీ, భార‌త ఆట‌గాళ్లు, జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు. విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో గంభీర్ కోచ్ గా వ‌చ్చిన త‌ర్వాత జ‌ట్టు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో గంభీర్ కూడా ఇప్పుడు టార్గెట్ గా మారాడు.

Rahul Dravid, Gautam Gambhir

గంభీర్ ఏం చెప్పాడు?

కొన్ని సంవత్సరాల క్రితం, గౌతమ్ గంభీర్ దేశీయ క్రికెట్ ఆడటంపై భారత ఆటగాళ్లకు క్లాసులు ఇవ్వడం కనిపించింది.  ESPNలో గంభీర్ మాట్లాడుతూ.. "మీరు ఢిల్లీ క్రికెట్ గురించి పట్టించుకోకపోతే, అక్కడికి వెళ్లి మీ కలను నెరవేర్చుకోవడానికి మీకు వేదిక ఇచ్చింది. మీరు దానికి కట్టుబడి ఉండకూడదనుకుంటే, ఆ రాష్ట్రానికి మీ అవసరం లేదు. దాని గురించి నేను చాలా స్పష్టంగా ఉన్నాను. అందుకే సెలెక్టర్లకు ఆ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌వ‌ద్ద‌ని ఎప్పుడో చెప్పాను. కానీ, ఒక్కోసారి సెలక్టర్లకు ఈ పని చేసే ధైర్యం ఉండదని" అన్నాడు.

Virat Kohli and Gautam Gambhir

BGT తర్వాత కూడా గంభీర్ అదే విష‌యం చెప్పాడు.. 

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ముగిసిన త‌ర్వాత కూడా భార‌త ప్లేయ‌ర్లు విఫ‌లమైన క్ర‌మంలో గంభీర్ మరోసారి దేశవాళీ క్రికెట్ ఆడాలని క్రికెట‌ర్ల‌కు సూచించాడు. "ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశవాళీ క్రికెట్‌కు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్క ఆట మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలి.  రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు నిబద్ధత కలిగి ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేన‌ని" చెప్పారు.

Latest Videos

click me!