Temba Bavuma Creates History: కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరిగిన న్యూ ఇయర్ టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా క్రికెట్ ప్రపంచంలో సరి కొత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు.
సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు వికెట్ల తేడాతో స్వల్ప విజయంతో, దక్షిణాఫ్రికా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జూన్ 11-15 తేదీలలో లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికా తలపడునుంది.
Temba Bavuma
టెంబా బావుమా చరిత్ర సృష్టించాడు
టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా టెంబా బావుమా అద్భుతమైన రికార్డును సాధించాడు. 34 ఏళ్ల అతను తన కెరీర్‌లో తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లలో ప్రోటీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. వాటిలో ఎనిమిది మ్యాచ్‌లను ఒక డ్రాతో గెలుచుకున్నాడు.
దీంతో టెస్ట్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ రెండో కెప్టెన్ గా టెంబా బావుమా గెలిచాడు. ఆడిన టెస్టులు గెలిచిన మ్యాచ్ ల వివరాలను గమనిస్తే 74 ఏళ్లలో అత్యుత్తమం, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవది. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్‌మన్ (1921) మాత్రమే తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో మెరుగైన ఆరంభాన్ని అందించాడు.
ఆసీస్ దిగ్గజాలను సమం చేసిన టెంబా బావుమా
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆస్ట్రేలియా ద్వయం వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1921), లిండ్సే హాసెట్ (1951) లను సమం చేశాడు. వీరు తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించారు. టెస్టు మ్యాచ్‌లో ఓడిపోకుండా అత్యధిక విజయాలు సాధించిన టెస్టు కెప్టెన్‌గా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రపంచ రికార్డును బావుమా సమం చేశాడు.
ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లు:
1. వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆస్ట్రేలియా)
2. టెంబావ్ బావుమా (దక్షిణాఫ్రికా)
3. బ్రియాన్ క్లోజ్ (ఇంగ్లండ్)
4. చార్లెస్ ఫ్రై (ఇంగ్లండ్)
5. అజింక్యా రహానే (భారత్)
Temba Bavuma
మరో అద్భుత రికార్డుకు చేరువగా బావుమా
2025 WTC ఫైనల్‌లో బావుమా ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అధిగమించి, ఒక టెస్టులో ఓడిపోకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో 2025 WTC ఫైనల్ కు ముందు ప్రోటీస్ ఐర్లాండ్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ ఆడవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన షుక్రీ కాన్రాడ్ తెలిపాడు.
ఇది లార్డ్స్‌లో షోడౌన్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని ఇస్తుంది. బావుమా కెప్టెన్‌గా తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలవగలిగితే, బావుమా చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్సీగా రికార్డు సృష్టిస్తాడు. అలాగే, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 10 విజయాలు సాధించిన కెప్టెన్‌గా కూడా నిలుస్తాడు.