Champions trophy team India squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ వారంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. జట్టులో ఉండే సభ్యుల వివరాలను అందించడానికి జనవరి 12న చివరి తేదీగా ఐసిసి నిర్ణయించింది. స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం టీమిండియా కు పెద్ద ఆందోళనగా మారింది. అయితే ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం బుమ్రా భారత జట్టులో ఉంటాడు. యశస్వి జైస్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ గా చూస్తుండగా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నాడని సమాచారం.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో తన తరువాతి మ్యాచ్ ను భారత్ ఆడునుంది.
అయితే మినీ వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత ప్లేయింగ్ 11 ను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఇటీవలి జట్టు ప్రదర్శన నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, భారత జట్టు మేనేజ్మెంట్ పలు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Shubman Gill, Rohit Sharma
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఓపెనింగ్ జోడి ఎవరు?
ఇటీవలి ప్రదర్శనలు గమనిస్తే స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు స్థానం దక్కకపోవచ్చు కానీ మొత్తంగా రికార్డులు గమనిస్తే భారత జట్టు ఓపెనింగ్ ను శుభ్ మన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ప్రారంభిస్తాడు. వీరిద్దరూ దూకుడు బ్యాటింగ్ తో చెలరేగితే భారత్ కు అద్భుతమైన ఆరంభం లభిస్తుంది. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇక మూడో స్థానంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉంటాడు. ఇప్పటివరకు 255 వన్డేల్లో 283 ఇన్నింగ్స్ లలో 508.18 సగటుతో విరాట్ కోహ్లీ 13906 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ 50 సెంచరీలు 72 అర్ధ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ కు నాలుగో స్థానంలో జట్టులో స్థానం దక్కవచ్చు.
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లలో జట్టులో ఉండేది ఎవరు?
ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతమైన రికార్డు కలిగిన కేఎల్ రాహుల్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ తో పాటు రిషబ్ పంత్ కూడా జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్ గా ఉండే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ 11 లో మాత్రం కె.ఎల్ రాహుల్ కు స్థానం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే 2023 ప్రపంచ కప్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన వికెట్ కీపింగ్ తోపాటు మంచి పరుగులు సాధించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రానన్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మంచి పరుగులు చేయగల సత్తా ఉన్న ప్లేయర్. అలాగే మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా ఆడుతూ బౌండరీలు సాధించగలడు. అవసరమైన సమయంలో వికెట్లను కూడా తీయగల స్టార్.
Image Credit: Getty Images
బుమ్రా తో పాటు భారత బౌలింగ్ విభాగాన్ని మోసేది ఎవరు?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించబోయే భారత జట్టులో బుమ్రా తో పాటు మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ విభాగానికి వస్తే ప్లేయింగ్ 11లో అక్షర పటేల్, రవీంద్ర జడేజాలకు చోటు దక్కే చాన్స్ ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనాలు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్, బుమ్రా.