సెలక్టర్లు కళ్లు మూసుకున్నారా, అతని పర్ఫామెన్స్... సర్ఫారాజ్ ఖాన్‌కి మాజీ కెప్టెన్ సపోర్ట్...

Published : Jun 13, 2022, 02:51 PM IST

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డుల వరద పారిస్తున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్, ఈ సీజన్‌లో ఇప్పటికే 600+ పరుగులు చేసేశాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 153 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కి టీమిండియాలో చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్..

PREV
18
సెలక్టర్లు కళ్లు మూసుకున్నారా, అతని పర్ఫామెన్స్... సర్ఫారాజ్ ఖాన్‌కి మాజీ కెప్టెన్ సపోర్ట్...

ఐపీఎల్‌లో పాకెట్ డైనమేట్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకి ఆడాడు. అయితే ఐపీఎల్‌లో కూడా సర్ఫరాజ్ ఖాన్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు...

28

ఓవరాల్‌గా ఏడో ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్, ఏడోసారి 150+ నమోదు చేశాడు. ఇందులో రెండు త్రిబుల్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. గత 13 ఇన్నింగ్స్‌ల్లో 162.4 సగటుతో 1624 పరుగులు చేశాడు సర్ఫరాజ్ ఖాన్, ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు, ఆరు సార్లు 150+ స్కోర్లు, మూడు డబుల్ సెంచరీలు, ఓ త్రిబుల్ సెంచరీ ఉన్నాయి...

38
sarfaraz khan

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77.7 సగటుతో 2099 పరుగులు నమోదు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటుతో 2 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. డాన్ బ్రాడ్‌మెన్ సగటు 95.14 కాగా విజయ్ మర్చంట్ 71.64, జార్జ్ హెడ్లీ 69.86, బహీర్ షా 69.02 సగటుతో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు...

48
Sarfaraz Khan

అయినా సరే సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోవడం లేదు టీమిండియా సెలక్టర్లు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి కానీ, వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకి ఎంపిక చేసిన జట్టులో కానీ సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు కల్పించలేదు. దీనిపై మాజీ క్రికెటర్, కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు..

58

‘సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడున్న ఫామ్‌కి, అతను చేస్తున్న పరుగులకి టీమిండియాలో ఉండాలి. రంజీ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు, సెంచరీలు చేస్తున్నాడు. అయినా సెలక్టర్లు అతన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...

68

సెలక్టర్లకు సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న విధానం కనిపించడ లేదా? లేక ఐపీఎల్‌లో ఆడితేనే ఆడినట్టుగా భావిస్తారా? టీమిండియాలో చోటు కోసం అతనేం చేయాలో మీరే చెప్పండి. ప్రతీ ఏడాది ముంబై తరుపున 800లకు పైగా పరుగులు చేస్తున్నాడు...

78

సర్ఫరాజ్ ఖాన్‌కి 12 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను అతన్ని చూస్తూ వస్తున్నా. అతను ఎప్పుడూ సక్సెస్ కోసం తపిస్తూ ఉంటాడు. అంతేనా ఫిట్‌గా ఉంటాడు. అన్నింటికీ గంటల పాటు బ్యాటింగ్ చేసి, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు నిర్మించగలడు...

88

మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న మ్యాచ్ విన్నర్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒకడు. అతను స్పిన్, పేస్ బౌలింగ్ అనే తేడా లేకుండా పరుగులు చేస్తున్నాడు. అయితే సెలక్టర్లకు ఎందుకు కనిపించడం లేదు...’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్... 

click me!

Recommended Stories