సగం ఐపీఎల్ సీజన్ ఆడాడని టీమిండియాకి సెలక్ట్ చేసేస్తారా... గౌతమ్ గంభీర్ కామెంట్స్...

First Published Jan 24, 2022, 2:26 PM IST

ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ గెలిచింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఆ జట్టు నుంచి బుల్లెట్ వేగంతో టీమండియాలోకి దూసుకొచ్చిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్... అయితే అయ్యర్‌ సెలక్షన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్...

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో కేకేఆర్ ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్ 320+ పరుగులు చేసి ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు... 

అయ్యర్ బ్యాటింగ్ కారణంగానే ఫస్టాఫ్‌లో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, అద్భుత విజయాలతో ఫైనల్‌కి దూసుకురాగలిగింది. ఈ పర్ఫామెన్స్ కారణంగానే వెంకటేశ్ అయ్యర్‌కి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది...

‘కేవలం 7-8 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్‌ను భారత జట్టుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదు, టీ20ల్లో అయితే ఓకే కానీ వన్డేలకు అయ్యర్ సెలక్షన్ ఏ మాత్రం సరి కాదు...

ఓపెనర్‌గా ఆడిన వెంకటేశ్ అయ్యర్‌ను ఆరో స్థానంలో ఆడించడం కూడా కరెక్ట్ కాదు. అతను పవర్ ప్లేలో ఫ్రీగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు...

మిడిల్ ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులు లేని సమయంలో ఫ్రీగా ఆడమంటే అతను ఎలా ఆడగలడు. వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌లో ఎలా ఆడాలో తెలియక తికమకపడుతున్నట్టు అర్థమైంది...

ఓడిపోతామేమోననే భయంతో ఆడితే ఏ మ్యాచ్ కూడా గెలవలేం. కీర్తిప్రతిష్టలతో విజయం దరిచేరదు. ఎంత పెద్ద టీమ్ అయినా, ఎంత మంచి ప్లేయర్ అయినా పరుగులు రానప్పుడు కష్టపడాల్సిందే...

భారత జట్టులో నాలుగు, ఐదో స్థానంలో ఆడే బ్యాట్స్‌మెన్ కోసం ఇప్పటికే చాలామందిని ప్రయత్నించారు, చాలా అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ప్లేస్‌లో ఆడారు...

అయితే మిడిల్ ఆర్డర్‌లో మాత్రం భారత జట్టుకి రావాల్సిన రిజల్ట్ అయితే రావడం లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

మొదటి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు వెంకటేశ్ అయ్యర్. 2 వన్డేల్లో కలిపి కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక్క సిక్సర్ మాత్రమే ఉంది...

అయితే వెంకటేశ్ అయ్యర్‌ను వన్డేలకు సెలక్ట్ చేయడానికి కారణం ఐపీఎల్ పర్ఫామెన్స్ కాదు. విజయ్ హాజారే వన్డే ట్రోఫీలో వెంకటేశ్ అయ్యర్ ఇచ్చిన ప్రదర్శన...

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ 2021 టోర్నీలో 6 మ్యాచుల్లో 63.17 సగటుతో 379 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి రెండు భారీ సెంచరీలు చేశాడు...

click me!