విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, రిజల్ట్ ఇలా ఉండేది కాదు... బీసీసీఐ మాజీ సెలక్టర్ కామెంట్...

First Published Jan 24, 2022, 1:32 PM IST

సౌతాఫ్రికా టూర్ ఆరంభానికి ముందు భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించాయి...  ముఖ్యంగా వన్డేల్లో అత్యధిక శాతం విజయాలు నమోదుచేసిన విరాట్ కోహ్లీని వన్డే సారథిగా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది...

సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో రెండుసార్లు సౌతాఫ్రికాలో పర్యటించిన టీమిండియా, రెండే రెండు వన్డేల్లో విజయాలు అందుకోగలిగింది...

అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆరు వన్డేలు ఆడితే, అందులో ఐదింట్లో విజయాలు అందుకుని, సఫారీ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది... అలాంటి కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగానే పడింది...

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మొదటి వన్డేలో 31 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మూడో వన్డేలోనూ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది...

‘సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా ఫెవరెట్. టెస్టుల్లోనే కాదు, వన్డేల్లో కూడా భారత జట్టును ఓడించడం సౌతాఫ్రికాకి చాలా కష్టం అనుకున్నారంతా. అయితే రెండో టెస్టు నుంచే సీన్ మారిపోయింది..

సెంచూరియన్ టెస్టు విజయం తర్వాత భారత జట్టులో ఇంతకుముందున్న ఉత్సాహం పోయింది. దీనికి కారణం ఏంటనేది అందరికీ తెలుసు...

కెఎల్ రాహుల్ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చాలా అగ్రెసివ్, ఎంతో ఎనర్జిటిక్... భారత జట్టులో ఇప్పుడు మిస్ అయ్యింది ఆ ఎనర్జీయే...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ, ప్లేయర్లను కూడా గేమ్‌లో పూర్తిగా లీనం అయ్యేలా చేసేవాడు. అందుకే అతని కెప్టెన్సీలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు...

ఇప్పుడు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆ స్పార్క్ కనిపించడం లేదు, ఆ ఎనర్జీ కూడా ఇప్పుడు లేదు... త్వరత్వరగా 3 వికెట్లు కోల్పోయిన తర్వాత సౌతాఫ్రికా కోలుకుని, మంచి స్కోర్లు చేయగలిగింది...

టీమిండియాను మిడిల్ ఆర్డర్ సమస్య వెంటాడింది. వెంకటేశ్ అయ్యర్‌ ఓపెనర్‌గా రాణించాడు, అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలనుకోవడం ఎంత వరకూ కరెక్ట్... 

పవర్ ప్లేలో బౌండరీలు బాదేవాడిని, ఆరో స్థానంలో దింపి ఆడమంటే ఎలా ఆడగలడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, ఇలాంటి రిజల్ట్ వచ్చి ఉండేది కాదు...

భారత జట్టులో ఫీల్డింగ్‌లో కూడా చాలా తప్పులు చేసింది, చేతుల్లోకి వచ్చిన క్యాచులను వదిలేసింది. అంతేకాకుండా ఈజీగా సింగిల్స్ ఇచ్చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కుదురుకునేందుకు అవకాశం ఇచ్చారు...

విరాట్ కెప్టెన్సీలో ఇలాంటి తప్పులు జరిగేవి కావు, క్యాచ్ మిస్ చేసినా, మిస్ ఫీల్డ్ చేసినా... కోహ్లీ అగ్రెసివ్‌గా ఉంటాడని ఫీల్డర్లు తప్పులు చేసేవాళ్లు కాదు... 

విరాట్ కోహ్లీ లాంటి ఫీల్డర్‌ను ఎలా వాడుకోవాలో కూడా కెఎల్ రాహుల్‌కి తెలియడం లేదు. అతన్ని సర్కిల్స్‌లో కాకుండా చాలావరకూ బౌండరీల దగ్గర ఫీల్డింగ్‌కి పెడుతున్నాడు... 

రవిశాస్త్రి, విరాట్ కోహ్లీల సమయంలో దూకుడే మంత్రంగా టీమిండియా ఆటతీరు సాగింది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఎంట్రీతో పద్ధతి మార్చుకోవాలనే ఆలోచన, వారిని ఇబ్బందిపెడుతున్నట్టుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్... 

click me!