శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. ఇందులో 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఎవరీ సరాన్ష్ జైన్? అతడిని ఎందుకు ఎంపిక చేశారు?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం BCCI సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరగనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్‌నెస్‌ను BCCIకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నిర్ధారించాల్సి ఉంది.
25
33 ఏళ్ల వయసులో భారత జట్టులోకి సరాన్ష్ జైన్
స్పిన్ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో 33 ఏళ్ల స్పిన్నర్ సరాన్ష్ జైన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతనికి ఇదే తొలి టెస్ట్ పిలుపు.
ఇక సీనియర్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2026 సందర్భంగా అయిన మోచేతి గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఉపఖండం పిచ్‌లపై అతని రాక భారత స్పిన్ బౌలింగ్‌కు బలం చేకూరుస్తుంది.
35
ఎవరీ సరాన్ష్ జైన్?
ఈ జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. ఇంతమంది యువకులు ఉండగా 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు అవకాశం రావడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సరాన్ష్ జైన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 2014-15 సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అతడి అవసరం ఇప్పుడు టీమిండియాకు వచ్చింది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ను మరింత బలంగా మార్చేందకే సరాన్ష్ కు అవకాశం ఇచ్చివుంటారని క్రికెట్ పండితుల అభిప్రాయం.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆల్-రౌండర్‌గా అదరగొట్టాడు
మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో, నాకౌట్ దశలకు చేరడంలో సరాన్ష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ఇండియా A, సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఎంపికై దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లలోనూ రాణించాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 2223 పరుగులు చేయడంతో పాటు, 188 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆఫ్-స్పిన్నర్‌గా రాణించగలడు. వాషింగ్టన్ సుందర్ లాగే బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా ఉండటంతో BCCI అతడిని శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేసింది.