సంజూ శాంసన్ ఫెయిల్, పంత్‌ను ఆడించండి... ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కామెంట్...

Published : Dec 07, 2020, 06:43 PM IST

భారత జట్టులో ఎన్ని అవకాశాలు ఇచ్చినా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నప్పుడే పంత్‌కి భారీగా అవకాశాలు ఇచ్చింది టీమిండియా. అయితే ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప మిగిలిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు పంత్. నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు సమర్పించుకున్నాడు. ఇప్పుడు సంజూ శాంసన్‌ది కూడా అదే ధోరణి.

PREV
110
సంజూ శాంసన్ ఫెయిల్, పంత్‌ను ఆడించండి... ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కామెంట్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు...

210

సంజూ, తెవాటియా మెరిసిన మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

310

ఐపీఎల్ పర్ఫామెన్స్, దేశవాళీ క్రికెట్ పర్ఫామెన్స్ ఆధారంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్.. మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

410

మొదటి టీ20 మ్యాచ్‌లో 15 బంతు్లో ఓ సిక్స్, ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన శాంసన్, రెండో టీ20లో 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 15 పరుగులు చేశాడు.

510

రెండు మ్యాచుల్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సంజూ శాంసన్‌ను తొలగించి, రిషబ్ పంత్‌కి అవకాశం ఇవ్వాలని అంటున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యజమాని...

610

‘సంజూ శాంసన్ కావాల్సినన్ని పరుగులు చేయలేకపోతున్నాడు. రిషబ్ పంత్ టీమిండియాకి బెస్ట్ వికెట్ కీపర్.. అతనికి ఛాన్స్ ఇవ్వాలి’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్.

710

అయితే ఢిసీ ఓనర్ కామెంట్లపై విరుచుకుపడుతున్నాడు టీమిండియా ఫ్యాన్స్. ‘రిషబ్ పంత్‌కి ఇచ్చినన్ని అవకాశాలు, మరో క్రికెటర్‌కి ఇవ్వలేదని... సంజూ శాంసన్‌కి అన్ని ఛాన్సులు వచ్చి ఉంటే ఇంకా మెరుగ్గా పరుగులు సాధించేవాడని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

810

ప్రాక్టీస్ మ్యాచులో వృద్ధిమాన్ సాహా డకౌట్ అయిన తర్వాత పంత్‌కి ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు రిషబ్ పంత్ అభిమానులు...

910

పూజారా తర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ను పక్కన బెట్టడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు. 

1010

గత పర్యటనలో నాలుగు టెస్టులు ఆడిన రిషబ్ పంత్... ఏడు ఇన్నింగ్స్‌ల్లో 350 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 282 పరుగులే చేశాడు. ఈ లెక్కలను చూస్తుంటే సాహా కంటే పంత్‌ బెటర్ ఆప్షన్ అంటున్నారు అభిమానులు.

click me!

Recommended Stories