సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ ఆడడానికి పనికి రాడా? కావాలని తప్పిస్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్...

Published : Jul 01, 2022, 05:06 PM IST

అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం టీమిండియా తరుపున టీ20 ఆరంగ్రేటం చేశాడు సంజూ శాంసన్. అయితే 2015 నుంచి ఇప్పటిదాకా సంజూ శాంసన్ ఆడింది 14 మ్యాచులే. అంటే ఏడాదికి కాదనుకుండా ఓ రెండు మ్యాచుల్లో సంజూ శాంసన్‌కి అవకాశం ఇస్తున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్నప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కేవలం మొదటి మ్యాచ్‌లో మాత్రమే సంజూకి చోటు దక్కడం వివాదాస్పదమైంది..

PREV
17
సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ ఆడడానికి పనికి రాడా? కావాలని తప్పిస్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్...
Sanju Samson

దేశవాళీ టోర్నీల్లో టీ20ల్లో 5 వేలకు పైగా పరుగులు చేసిన సంజూ శాంసన్, ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే అతనికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులోనూ సంజూ శాంసన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

27
Sanju Samson

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి సంజూ శాంసన్‌ని ఎంపిక చేసినా అతనికి తొలి టీ20లో తుది జట్టులో చోటు దక్కలేదు. రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 77 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసినప్పటికీ... అతనికి ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో చోటు కల్పించింది బీసీసీఐ...

37
Deepak Hooda and Sanju Samson

దీపక్ హుడా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూ శాంసన్ చేస్తున్న పరుగులను మాత్రం పట్టించుకోవడం లేదు. 2021 నుంచి ఇప్పటిదాకా టీ20ల్లో 1110 పరుగులు చేసిన సంజూ శాంసన్, 141.76 స్ట్రైయిక్ రేటుతో రాణించాడు. 

47
Image credit: PTI

ఇదే సమయంలో రిషబ్ పంత్ టీ20ల్లో 1090 పరుగులు చేయగా స్ట్రైయిక్ రేటు, యావరేజ్ రెండూ సంజూ శాంసన్ కంటే తక్కువే. టీమిండియాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా కూడా సంజూ శాంసన్ వెనకే ఉన్నారు..

57
Sanju Samson

ఎంత టాలెంట్ ఉన్నా సంజూ శాంసన్  దక్షిణాది వాడు కావడం వల్లే టీమిండియాలో శాశ్వతమైన చోటు దక్కించుకోలేక పోతున్నాడని... ఉత్తరాదివాడైన రిషబ్ పంత్‌ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారని టీమ్ మేనేజ్‌మెంట్‌ని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.. 

67
Sanju Samson

ఈ ఏడాది భారత జట్టు తరుపున మూడు టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మూడో టీ20లో 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టాడు...

77
Sanju Samson with DK

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులాడి ఓ సెంచరీతో 484 పరుగులు చేసిన సంజూ శాంసన్, 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 458 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ని ఐపీఎల్ 2022 ఫైనల్‌కి చేర్చాడు. అయినా సంజూ శాంసన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే జట్టుకి పరిగణించడం లేదు బీసీసీఐ...

click me!

Recommended Stories