Jasprit Bumrah: ఇది అద్భుతం.. ఆ ట్రెండ్ మారుతున్నది : బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై ముంబై కోచ్ కామెంట్స్

First Published Jul 1, 2022, 4:01 PM IST

IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో  జట్టు సారథ్య బాధ్యతలు పేసర్ జస్ప్రిత్ బుమ్రా మోస్తున్నాడు. 

టీమిండియా పేసర్ బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పడంపై అతడికి ఐపీఎల్ లో (ముంబై ఇండియన్స్) కోచ్ గా వ్యవహరిస్తున్న మహేళ జయవర్దెనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇది అద్భుతమని.. అతడి హార్డ్ వర్క్ వల్లే ఇది సాధ్యమైందని కొనియాడాడు. 
 

బుమ్రా కెప్టెన్ గా నియమితుడైన  తర్వాత  అతడు బుమ్రా భార్య సంజనా గణేషన్ తో ఐసీసీ నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ‘బుమ్రాను టీమిండియా కెప్టెన్ గా నియమించినందుకు చాలా  ఆనందంగా ఉంది.  ఇది చాలా అద్భుతం.  
 

ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు సారథులుగా ఉండటమనేది  చాలా అరుదైన సందర్భం.  ఒక జట్టుకు కెప్టెన్ గా ఉండాలంటే  చాలా కష్టపడాలి. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో అయితే అనేక సవాళ్లతో కూడుకున్న విషయం. కానీ బుమ్రా దానికి అర్హుడు. 

గత కొన్నాళ్లుగా ట్రెండ్ మారుతుంది. ఆస్ట్రేలియాకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా అయ్యాక  మిగతా దేశాల బోర్డులు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఒక బౌలర్ కెప్టెన్ గా ఉండటమనేది గొప్ప విషయం. ఎందుకంటే వాళ్లు ఆట ఎలా కొనసాగుతుందో చూస్తారు.  వాళ్లు దానిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. 
 

మ్యాచ్ కోసం ఇంకా ఏం చేయాలి..? అనే ఆలోచనలోనే ఉంటారు. అదీగాక వాళ్ల ధ్యాస ఎప్పుడూ వికెట్ల మీదే ఉంటుంది. అందుకే టీమిండియాకు బుమ్రా కెప్టెన్ గా ఉండటం కూడా అద్బుతమైన విషయమే..’ అని అన్నాడు. 

బుమ్రాకు టెస్టు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువని  జయవర్దెనే కొనియాడాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ క్యాంప్ లో బుమ్రా చాలా సార్లు తనతో రెడ్ బాల్ క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడని తెలిపాడు. 

‘బుమ్రాకు రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముంబై ఇండియన్స్ క్యాంప్ లో అతడు నాతో ఈ విషయాన్ని పలుమార్లు పంచుకున్నాడు. అతడికి పరిమిత ఓవర్ల కంటే టెస్టు క్రికెట్ ఆడటమే ఆసక్తి. ఒక్క మ్యాచ్ కూడా మిస్  చేసుకోవాలని అనుకునే మనస్తత్వం బుమ్రాది. అది భారత్ కు ఎంతో ఉపకరించే అంశం..’ అని బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.

click me!