ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు కానీ... కొడుక్కి కెప్టెన్సీ దక్కడంపై జస్ప్రిత్ బుమ్రా తల్లి స్పందన...

Published : Jul 01, 2022, 03:30 PM IST

రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడం, కెఎల్ రాహుల్ గాయంతో జట్టుకి దూరం కావడంతో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్నాడు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. భారత జట్టుకి కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు బుమ్రా...

PREV
16
ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు కానీ... కొడుక్కి కెప్టెన్సీ దక్కడంపై జస్ప్రిత్ బుమ్రా తల్లి స్పందన...

సౌతాఫ్రికాలో టెస్టు ఆరంగ్రేటం చేసిన జస్ప్రిత్ బుమ్రా, విదేశాల్లోనూ 50, 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు విదేశాల్లోనూ టెస్టు కెప్టెన్‌గా ఆరంగ్రేటం చేయబోతున్నాడు. 29 టెస్టు మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ దక్కడంపై ఆయన తల్లి దల్జీత్ బుమ్రా స్పందనని వివరించింది మిసెస్ బుమ్రా సంజన గణేశన్...

26

‘బుమ్రా టీమిండియాకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడని తెలియగానే ఆమె చాలా సంతోషించారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు. బుమ్రాని మంచి పొజిషన్‌లో చూడాలని ఆమె ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు...

36
Jasprit Bumrah

బుమ్రాకి క్రికెట్ అంటే ప్రాణం. అందుకే బుమ్రా ప్రయాణంలో ప్రతీ అడుగును ఆమె వెంటుండి చూశారు. బుమ్రాకి టీమిండియా కెప్టెన్సీ దక్కిందని తెలియగానే ఓ రకమైన పారవశ్యంలోకి వెళ్లిపోయారామె...

46

నిజానికి ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ బుమ్రాకి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ అవకాశం నీ ఆలోచనలను, నీ ఆటను ప్రతిబింబించేలా ఉండాలని బుమ్రాకి సూచించారు.. ఆమెను ఇంత ఆనందంలో ఎప్పుడూ చూడలేదు...’ అంటూ తెలిపింది జస్ప్రిత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్...

56

జస్ప్రిత్ బుమ్రా తండ్రి జస్బిర్ సింగ్.. కొడుక్కి ఐదేళ్లు ఉండగానే చనిపోయారు. అప్పటి నుంచి కొడుకు బాధ్యతలు తీసుకుని స్టార్ క్రికెటర్‌గా మలిచింది ఆయన తల్లి దల్జీత్ బుమ్రా. దల్జీత్ బుమ్రా అహ్మదాబాద్‌లో ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ కొడుకు అవసరాలకి తీరుస్తూ వచ్చారు దల్జీత్ బుమ్రా.... 

66

చిన్నతనం నుంచి అనేక ఆర్థిక కష్టాలను అనుభవించిన జస్ప్రిత్ బుమ్రా, 2013లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేయడంతో అతని కెరీర్ మారిపోయింది. 2016లో టీమిండియాలోకి వచ్చిన బుమ్రా, ఆరేళ్ల తర్వాత టెస్టు కెప్టెన్సీ దక్కించుకున్నాడు.. 

click me!

Recommended Stories