సౌత్ ఇండియన్ కావడం వల్లే సంజూ శాంసన్‌పై ఇంత వివక్ష! పంత్‌ని కొనసాగిస్తూ, శాంసన్‌పై ఎందుకింత కక్ష...

Published : Nov 27, 2022, 07:29 AM IST

కొన్నాళ్లుగా టీ20 టీమ్‌లో ఏ మాత్రం కుదురుకోలేకపోతున్నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఫెయిల్ అయ్యాడు. అయితే అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించింది టీమిండియా. అదే టైమ్‌లో టీ20ల్లో చక్కగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కి మాత్రం రిజర్వు బెంచ్‌లో కూడా స్థానం దక్కలేదు..

PREV
18
సౌత్ ఇండియన్ కావడం వల్లే సంజూ శాంసన్‌పై ఇంత వివక్ష! పంత్‌ని కొనసాగిస్తూ, శాంసన్‌పై ఎందుకింత కక్ష...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కి అవకాశం దక్కలేదు. రెండు మ్యాచుల్లోనూ రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, టీమిండియా మేనేజ్‌మెంట్... సంజూ శాంసన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది... ఎప్పటిలాగే రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యి, అభిమానులను నిరాశపరిచాడు...

28
Sanju Samson-Shreyas Iyer

మొదటి వన్డేలో రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి నిరాశపరచగా సంజూ శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్...

38
Sanju Samson

అయితే రెండో వన్డేలో సంజూ శాంసన్‌పై వేటు వేసింది టీమిండియా. తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ని తప్పించొచ్చు...

48
Sanju Samson

అలాగే సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నా, వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో సూర్య యావరేజ్ 20 కంటే తక్కువగా ఉంది. తొలి వన్డేలో కూడా సూర్య 4 పరుగులకే అవుట్ అయ్యాడు... ఫెయిల్ అయిన ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా, సంజూ శాంసన్‌పై వేటు వేసింది..

58
Sanju Samson

సంజూ శాంసన్‌కి మరోసారి తుదిజట్టులో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వస్తోంది. సంజూ శాంసన్, దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తున్నారు అభిమానులు...

68
Image credit: PTI

శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!  సంజూ శాంసన్ ప్లేస్‌లో తుదిజట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే...

78
Sanju Samson

వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నా.... అంతర్జాతీయ టీ20ల్లో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకపోయినా నార్త్ ఇండియన్ కావడం వల్లే రిషబ్ పంత్‌కి ఇన్ని అవకాశాలు వస్తున్నాయని... సంజూ శాంసన్, దక్షిణ భారతీయుడు మాత్రమే కాకుండా అగ్ర వర్ణానికి చెందినవాడు కాకపోవడం వల్ల టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. 

88
Sanju Samson Player of the match

సంజూ, ఇంకా ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం వెయిట్ చేసే కంటే, వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవుతాడని పోస్టులు చేస్తున్నారు.. త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్, టీమ్‌లో ప్లేస్ కోల్పోవడం... ఆస్ట్రేలియాలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన టి నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

click me!

Recommended Stories