వరల్డ్ కప్ పోయింది! అతన్ని తప్పించిన బీసీసీఐ... మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్‌కి...

First Published Nov 26, 2022, 7:27 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరినా ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుని ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీ తర్వాత సెలక్టర్లపై వేటు వేసిన బీసీసీఐ, తాజాగా మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్‌కి కూడా షాక్ ఇచ్చింది...
 

Paddy Upton, Team India, Rahul Dravid

2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు తిరిగి భారత జట్టు సహాయ బృందంలోకి తీసుకొచ్చింది బీసీసీఐ...

Image credit: PTI

జూలై చివరి వారంలో భారత జట్టులో చేరిన ప్యాడీ అప్టన్‌‌తో, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసే వరకూ భారత జట్టు మెంటల్ స్ట్రెంగ్త్ కోచ్‌గా వ్యవహరించరించేలా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది బీసీసీఐ...
 

Image credit: PTI

టీమిండియా, వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టడంతో ప్యాడీ అప్టన్ కాంట్రాక్ట్ గడువును పొడగించేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. దీంతో ప్యాడీ అప్టన్‌ విధుల నుంచి తప్పుకున్నాడు...

ఐదు నెలల కాలానికి ప్యాడీ అప్టన్‌కి దాదాపు రూ.10 కోట్ల వరకూ చెల్లించినట్టు సమాచారం.  2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియాకి కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్, ప్యాడీ అప్టన్‌ను ప్రత్యేకంగా పిలిపించి మరీ మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించాడు.

Image credit: Getty

ఆ సమయంలో మెంటల్ కండీషనింగ్ కోచ్‌గానే కాకుండా స్ట్రాటెజిక్ లీడర్‌షిప్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు ప్యాడీ అప్టన్. ఆటగాళ్లపై క్రికెట్, పర్ఫామెన్స్, షెడ్యూల్స్, కీ బాటిల్స్ కారణంగా మానసిక ఒత్తిడి పడకుండా, వారి మెంటల్ కండీషన్ ఎప్పుడు ఒకేలా ఉండలా చూడడమే ప్యాడీ అప్టన్ పని... 

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి కొంత మంది ప్లేయర్లు తప్ప... మిగిలిన ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ప్రెషర్‌తో డిప్రెషన్‌కి లోనైనట్టు కనిపించాడు. దీంతో మెంటల్ కండీషనింగ్ కోచ్‌ని కొనసాగించడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చింది బీసీసీఐ.. 

click me!