మావోడు వరల్డ్ కప్ ఆడకపోవడం మంచిదైంది... ఉమ్రాన్ మాలిక్ తల్లిదండ్రుల కామెంట్...

First Published Nov 26, 2022, 8:00 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున సెన్సేషనల్ పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఉమ్రాన్ మాలిక్... జమ్మూ కశ్మీర్‌కి చెందిన ఓ పండ్ల వ్యాపారి కుమారుడైన ఉమ్రాన్ మాలిక్, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం చేశాడు...

umran malik

యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్క వికెట్ కూడా తీయలేని చోట మొట్టమొదటి వన్డే ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్, 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. 143-150+ వేగంతో బంతులు విసిరి.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఉమ్రాన్ మాలిక్...

ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్, కొడుకు అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం గురించి మీడియాతో మాట్లాడాడు. ‘ఐపీఎల్‌లో కేన్ విలియంసన్‌కి మా వాడు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు, ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా తలబడుతున్నారని మా ఆవిడ చెప్పాను. ఇది ఓ రకంగా మాస్టర్, శిష్యుడి మధ్య పోటీలాంటిది. నేను ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్ చేశా...

అందరూ మావోడు వరల్డ్ కప్ ఆడాల్సిందని అంటున్నారు. మా వరకూ మాత్రం వాడు వరల్డ్ కప్ ఆడకపోవడం మంచిదైందనే అనిపిస్తోంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. మనం ఆరాటపడినంత మాత్రం వెంటనే జరిగిపోదు...

Image credit: Getty

ఇప్పుడు మా అబ్బాయి నేర్చుకునే దశలోనే ఉన్నాడు. వాడికి ఇంకా చాలా అనుభవం కావాలి, ఎంతో నేర్చుకోవాలి. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. వాళ్ల నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి...

umran malik

తొందర అవసరం లేదు. ఇప్పుడు జట్టులో ఉన్న ప్లేయర్లు చాలా అనుభవం ఉన్నవాళ్లు. వాళ్లు బాగానే ఆడుతున్నారు. మా వాడి సమయం వచ్చినప్పుడు వాడు కూడా వరల్డ్ కప్ ఆడతాడు. చాలారోజులుగా సంజూ శాంసన్ రావాలి, ఉమ్రాన్ మాలిక్ రావాలి అంటున్నారు. మొదటి వన్డేలో వాళ్లిద్దరూ ఆడారు...

మా అబ్బాయి దేశం తరుపున ఆడుతుండడమే మాకు గర్వకారణం. ప్రపంచమంతా వాడిని చూస్తోంది. ఇది అతని మొదటి వన్డే, చాలా సంతోషంగా ఉంది. తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందని నమ్ముతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్..

click me!