సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన తొలి వన్డే క్రికెట్ ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా సంజూ శాంసన్‌కి కావాల్సినంత కిక్‌ని అందించింది. కొన్నాళ్లుగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్‌కి మరింత జోష్‌ని నింపింది.
250 పరుగుల లక్ష్యఛేదనలో సంజూ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా 9 పరుగుల తేడాతో పోరాడి ఓడింది భారత జట్టు... టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయినా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ కలిసి ఆఖరి వరకూ పోరాడారు...
25
Sanju Samson
63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు రాబట్టాడు. అయితే అంతకుముందు 39వ ఓవర్‌లో సంజూ శాంసన్‌కి స్ట్రైయిక్ రాకపోవడం టీమిండియాపై ప్రభావం చూపింది...
35
sanju samson
‘19వ ఓవర్‌లో కగిసో రబాడా నో బాల్ వేయడంతో నాకు భయమేసింది. ఎందుకంటే ఆ బాల్‌కి సింగిల్ తీసి ఉంటే సంజూ శాంసన్‌కి స్ట్రైయిక్ వచ్చి ఉండేది. సంజూ శాంసన్‌లా ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న బ్యాటర్, ఏదైనా చేయగలడు..
45
Sanju Samson
ఐపీఎల్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్‌ని చాలాసార్లు చూశాను, గమనించాను. అతను బౌలర్లను ఓ ఆటాడుకుంటాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో సంజూ శాంసన్ బ్యాటింగ్ భీకరంగా ఉంటుంది. సంజూ , యువరాజ్‌తో సమానంగా సిక్సర్లు కొట్టగలడు...
55
Image credit: PTI
ఆఖరి ఓవర్‌లో 30+ పరుగులు కావాల్సి వచ్చినా సంజూ శాంసన్ మ్యాచ్‌ని ఫినిష్ చేయగలడు. అందుకే కాస్త భయపడ్డాను. సౌతాఫ్రికా మ్యాచ్ ఓడిపోకూడదని కోరుకున్నా. టీమిండియా ఓడినా శాంసన్ బాగా ఆడాడు...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్..