టీమిండియాకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డేల్లో అత్యధిక విజయాల శాతం అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20ల్లోనూ విదేశాల్లో సిరీసుల్లో సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ కాదంటున్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...
‘నా దృష్టిలో టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఎమ్మెస్ ధోనీ టాప్‌లో ఉంటాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐసీసీ ఈవెంట్లలో పర్ఫామెన్స్ ఆధారంగా గొప్ప కెప్టెన్‌ని డిసైడ్ చేస్తాను...
210
ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలోనే కెప్టెన్సీకి అసలైన పరీక్ష జరుగుతుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆఫీస్‌కి వెళ్లి ఇంటికి రావడం వంటివి. రోజూ ఆఫీస్‌కి వెళుతూ వస్తూ ఉంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు...
310
అయితే ఐసీసీ ఈవెంట్లు అనేవి అలా కాదు. సెంటర్‌కి వెళ్లి బోర్డు ఎగ్జామ్ రాయడంలాంటివి. ఆ విషయంలో ఎమ్మెస్ ధోనీ ఓ అద్భుతమైన లీడర్... విరాట్ కోహ్లీ మాత్రం ఈ విషయంలో చాలా దూరంలో ఉన్నాడు...
410
విరాట్ కోహ్లీ కూడా మంచి కెప్టెన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పిచ్‌లో ఆడుతున్నమనే విషయాన్ని పట్టించుకోకుండా కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు విదేశాల్లో ఘన విజయాలు అందుకుంది...
510
అంతేకాకుండా టీమిండియా పేస్ బౌలింగ్‌ను అత్యంత పటిష్టంగా మార్చడంలో విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు. దానికి అతని అగ్రెసివ్ యాటిట్యూడ్ కెప్టెన్సీయే కారణం...
610
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆఖరి నిమిషం వరకూ పోరాడింది భారత జట్టు. అయితే విజయం మాత్రం రాలేదు. అందుకే కోహ్లీ మంచి కెప్టెన్ అయినా గొప్ప కెప్టెన్ల లిస్టులో మాత్రం చేరలేకపోయాడు...
710
కపిల్ దేవ్... ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్ల లిస్టులో తప్పక ఉంటాడు. భారత క్రికెట్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన కెప్టెన్ ఆయన. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో కపిల్ దేవ్ ముందు వరుసలో ఉంటాడు...
810
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న భారత జట్టుకు విజయాలు పరిచయం చేసి, విదేశాల్లో కూడా టీమిండియా విజయాలు అందుకోగలదని నిరూపించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ...
910
సునీల్ గవాస్కర్ కూడా టీమిండియా గొప్ప కెప్టన్లలో ఒకడిగా ఉంటాడు. భారత క్రికెట్ 10 ఏళ్ల క్రితం మొదలుకాలేదు. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి జట్టుకి గెలుపు కసిని పరిచయం చేసిన కెప్టెన్లలో గవాస్కర్ ఒకడు...
1010
నా దృష్టిలో ఎమ్మెస్ ధోనీ, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్‌లు విరాట్ కోహ్లీ కంటే గొప్ప కెప్టెన్లు... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...