ఎమ్మెస్ ధోనీ... టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్. అయితే మాహీ కెప్టెన్సీలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్పాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి ఎందరో లెజెండరీ క్రికెటర్లు టీమిండియాలో చోటు కోల్పోయారు...
2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఎమ్మెస్ ధోనీ, సీనియర్ క్రికెటర్లు నిర్ధాక్షిణ్యంగా జట్టులో నుంచి తీసేశాడు. ఆఖరికి వీవీఎష్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్లు కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు...
210
టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న ఇర్ఫాన్ పఠాన్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోలేక ఎన్నో ఏళ్లు ఆశగా ఎదురుచూడాల్సి వచ్చింది...
310
‘ఎమ్మెస్ ధోనీకి నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే నను, ధోనీని పెళ్లి చేసుకోలేదు... ఒక వ్యాఖ్యాన్ని ఒక్కొకరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. అది అర్థం చేసుకునేవారికి బట్టి ఉంటుంది...
410
2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత భారత జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఆ విషయం అందరికీ తెలుసు. వీరేంద్ర సెహ్వాన్, నేను, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ వంటి వాళ్లం భారత జట్టుకి ఆడుతూ రిటైర్ అయ్యేవాళ్లం...
510
అయితే మాకు అవకాశం దొరకలేదు. ఐపీఎల్‌లో ఆడుతున్నా, మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా సరే... మమ్మల్ని తుదిజట్టులోకి తీసుకోలేదు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన ప్లేయర్లు ఎవ్వరూ ఆ తర్వాత కలిసి ఆడలేకపోవడం దురదృష్టకరమైన విషయమే...
610
ఎందుకు? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది. 2011 వరల్డ్‌కప్ ఆడిన ప్లేయర్లలో కొందరు మాత్రమే 2015 వరల్డ్‌కప్‌లో ఆడగలిగారు? దేని వల్ల? వాళ్లు ఫామ్‌లో లేరా? వారి పర్ఫామెన్స్ బాలేదా?
710
అలా ఏమీ జరగలేదు. అందరూ ఫామ్‌లో ఉన్నా, పరుగులు చేస్తున్నా, వికెట్లు తీస్తున్నా... జట్టుకి మాత్రం ఎంపిక చేయలేదు. అలాగని నాకు ఎమ్మెస్ ధోనీపై ఎలాంటి కంప్లైంట్స్ లేవు...
810
ఎందుకంటే ఎమ్మెస్ ధోనీ నాకు మంచి స్నేహితుడు కూడా. అసలు సమస్య బీసీసీఐతోనే ఉంది. బీసీసీఐని నేను సర్కార్ అని పిలుస్తాను... వారి విధానాలు అలాగే ఉంటాయ్ మరి...
910
అప్పటి సెలక్టర్లు, వారి బాధ్యతలకు సరిగ్గా న్యాయం చేయలేదు. జట్టును కలిసి కట్టుగా ఆడనిచ్చేవాళ్లు కాదు... సీనియర్లు అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్నప్పుడు, జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి?
1010
నేను ఓ సారి ఈ విషయం గురించి సెలక్టర్లను ప్రశ్నించాను కూడా. అయితే వాళ్లు ఏదీ మా చేతుల్లో ఉండదని అన్నారు. అలాంటప్పుడు వాళ్లు సెలక్టర్లుగా ఉండి ఏం లాభం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సెలక్టర్ హర్భజన్ సింగ్...