ఆ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్... పాక్ మాజీ బౌలర్ ఉమర్ గుల్...

Published : Jan 31, 2022, 10:50 AM IST

లెజెండ్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ 2022) టోర్నీ భారత్, పాకిస్తాన్ జట్ల మాజీ ప్లేయర్ల మధ్య వివాదాలను మరోసారి తెరపైకి తెచ్చే వేదికగా మారింది. మొన్న మిస్బా వుల్ హక్, 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2011 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడితే, తాజాగా పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్, భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ బ్యాటింగ్ గురించి కామెంట్లు చేశాడు...

PREV
19
ఆ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్... పాక్ మాజీ బౌలర్ ఉమర్ గుల్...

ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆసియా లయన్స్ తరుపున బరిలో దిగుతున్న ఉమర్ గుల్,  బ్యాటింగ్‌లో కానీ బౌలింగ్‌లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...

29

అయితే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కంటే తన బ్యాటింగ్ చాలా బాగుంటుందని, దానికి 2012 వరల్డ్ కప్ మ్యాచ్‌ చూడాలంటూ కామెంట్ చేశాడు ఉమర్ గుల్...

39

‘హర్భజన్ సింగ్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు. అయితే నేను ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాను... అంటే హర్భజన్ సింగ్ కంటే బ్యాటింగ్ విషయంలో నేను చాలా బెటర్ అనే కదా...’ అంటూ వ్యాఖ్యానించాడు ఉమర్ గుల్...

49

2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల లక్ష్యఛేదనలో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. ఈ దశలో 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులతో మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు ఉమర్ గుల్...

59

గుల్ అవుటయ్యే సమయానికి పాకిస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు కావాలి. ఉమర్ అక్మల్, సయ్యద్ అజ్మల్ కలిసి పాక్‌కి విజయాన్ని అందించారు. ఉమర్ గుల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది...

69

హర్భజన్ సింగ్‌కి వన్డేల్లో, టీ20ల్లో హాఫ్ సెంచరీలు లేకున్నా టెస్టుల్లో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 2,224 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 417 వికెట్లు పడగొట్టాడు...

79

లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతుల్లో 25 పరుగుల తేడాతో ఓడింది ఆసియా లయన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు చేసింది...

89

కేవిన్ పీటర్సన్ 48 పరుగులు చేయగా కోరే అండర్సన్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డారెన్ సమీ 38, బ్రాడ్ హాడిన్ 37 పరుగులు చేశారు...

99

257 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆసియా లయన్స్, 8 వికెట్ల నష్టానికి 231 పరుగులకి పరిమితమైంది. దిల్షాన్ 25, జయసూర్య 38, ఉపుల్ తరంగ 25, మహ్మద్ యూసఫ్ 39, మహ్మద్ రఫీక్ 22 పరుగులు చేశారు..

click me!

Recommended Stories