రోహిత్ శర్మ, విరాట్‌లో సగం ఫిట్‌గా ఉన్నా, వాళ్లంతా అతని దరిదాపుల్లోకి కూడా రారు...

First Published Sep 15, 2022, 12:37 PM IST

రోహిత్ శర్మ... వన్డే క్రికెట్‌లో ఒక్క డబుల్ సెంచరీ చేయడమే కష్టం అనుకుంటే మూడు సార్లు ఆ ఫీట్ సాధించి... ఔరా! అనిపించుకున్నాడు. టీ20ల్లో రికార్డు స్థాయిలో నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

ప్రస్తుత క్రికెట్‌లో గొప్ప క్రికెటర్ ఎవరు అనే విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య పోలికలు, పోటీ చాలా రోజులుగా నడుస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని కూడా విరాట్, రోహిత్‌లతో పోల్చి కామెంట్లు చేస్తున్నారు కొందరు పాక్ మాజీలు...

అయితే సల్మాన్ భట్ మాత్రం రోహిత్ శర్మ రేంజ్‌కి మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లతో పోల్చి చూడడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించాడు. ‘రోహిత్ శర్మ స్కిల్స్ వేరు. అతని రేంజ్ వేరు. రోహిత్‌ని బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లతో పోల్చి చూడడం కరెక్ట్ కాదు...

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్‌లో సగం రోహిత్ శర్మకు ఉన్నా... ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అయ్యేవాడు. రోహిత్ శర్మతో పోటీపడగల ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఏబీ డివిల్లియర్స్. మధ్యలో ఏ ప్లేయర్‌ కూడా ఈ ఇద్దరి స్థాయిని అందుకోలేరు...

అదే విరాట్ కోహ్లీలా పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌ ఉంటే రోహిత్ శర్మ ఏం చేసేవాడో, ఏం సాధించవాడో మీ ఊహకే వదిలేస్తున్నా... రోహిత్ శర్మలో ఉన్న టాలెంట్‌కి వెలకట్టలేం...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

అప్పుడెప్పుడో 2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఫిట్‌నెస్ సమస్యలతో జట్టులోకి వచ్చి పోతూ చాలా ఏళ్లు కాలం గడిపాడు. 2013లో ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ శర్మ కెరీర్ వేగం పుంజుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మారిన తర్వాత టీమిండియాకి కూడా కీ ప్లేయర్‌గా మారిపోయాడు రోహిత్...

Rohit Sharma

రోహిత్ శర్మ కెరీర్ ఆరంభం నుంచి ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నప్పటికీ ఈ ఏడాది భారత జట్టు 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చిందంటే రోహిత్ శర్మ ఫిట్‌నెస్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

click me!