వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కూడా ఫెయిల్ అయ్యారు. రవీంద్ర జడేజా- ధోనీ కలిసి ఏడో వికెట్‌కి 116 పరుగులు జోడించారు.
Dhoni Run Out
టీమిండియా విజయానికి 10 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ అయ్యాడు.. 77 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అవుటైన కాసేపటికే ధోనీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత భువీ, చాహాల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా... విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది..
‘2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా లీగ్ స్టేజీలో అద్భుతంగా ఆడింది. 7 మ్యాచులు గెలిచి టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి వచ్చాం. అయితే సెమీ ఫైనల్ ఓటమి, టీమిండియాకి హార్ట్ బ్రేక్ మూమెంట్..
సెమీ ఫైనల్‌లో ఓటమి తర్వాత ప్లేయర్లు చాలా మంది చిన్న పిల్లల్లా ఏడిచారు. ధోనీ, దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా అతన్ని పట్టుకొని ఏడ్చేశారు. ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దమే..
ఆ మూడ్ నుంచి ప్లేయర్లు బయటపడడానికి చాలా కాలమే పట్టింది. ధోనీకి సరైన వీడ్కోలు ఇవ్వలేకపోయామనే బాధ, చాలా ప్లేయర్లలో నిండిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ భంగర్..