విరాట్ కోహ్లీ ఆ రికార్డు బ్రేక్ చేస్తే, అందరి కంటే ఎక్కువ సంతోషించేది సచిన్ టెండూల్కరే.. - ఇర్ఫాన్ పఠాన్

First Published | Oct 21, 2023, 5:34 PM IST

సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 49 వన్డే సెంచరీలు బాదితే, బుల్లెట్ స్పీడ్‌తో వన్డేల్లో 48 సెంచరీలు బాదేశాడు విరాట్ కోహ్లీ. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డు సమం అవుతుంది, ఇంకో వన్డే సెంచరీ బాదితే 50 వన్డే శతకాలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలుస్తాడు కోహ్లీ..

Sachin Tendulkar Virat Kohli

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 285 వన్డేల్లో 48 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 13,342 పరుగులు చేశాడు..

Sachin-Kohli-Rohit

టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు బాదితే, విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 30 టెస్టు శతకాలు మాత్రమే చేశాడు. 34 ఏళ్ల కోహ్లీ, మరో ఐదేళ్లు ఆడినా సచిన్ 51 టెస్టు సెంచరీల రికార్డును అందుకోవడం మాత్రం అసాధ్యం..

Latest Videos


‘విరాట్ కోహ్లీ తన ప్రతీ సెంచరీని ఎంతో ఎంజాయ్ చేస్తాడు. దేనికదే ప్రత్యేకంగా భావిస్తాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం చాలా చాలా స్పెషల్ కూడా.. 

అతను సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుకి వచ్చేశాడు. విరాట్ కోహ్లీ, సచిన్ వన్డే సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తే, ఆయన కంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఉండరు. కోహ్లీ, అతని ఫ్యాన్స్ కంటే సచిన్ ఎక్కువ ఆనందపడతాడు..

ఎందుకంటే తన రికార్డులను  ఓ భారతీయుడు బ్రేక్ చేయాలని సచిన్ టెండూల్కర్ కోరుకున్నాడు. విరాట్ కోహ్లీ అంటే టెండూల్కర్‌కి ప్రత్యేకమైన అభిమానం కూడా. విరాట్ కోహ్లీని ఆల్‌ టైం గ్రేట్ అంటుంటారు. ఆ స్టేజికి చేరుకోవడం అంత తేలిక కాదు..

sachin kohli

విరాట్ కోహ్లీ ఫోకస్ ఎప్పుడూ చెక్కుచెదరలేదు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక అతను మరింత ఎక్కువ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టగలుగుతున్నాడు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. 

click me!