ఓ మ్యాచ్ ఓడిపోవడం మంచిదే! ఆ మ్యాచ్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమ్మెస్ ధోనీ...

First Published | Oct 22, 2023, 3:40 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుని, అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. న్యూజిలాండ్‌పై టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచి 20 ఏళ్లు అవుతోంది..

2003లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచింది భారత జట్టు. ఆ తర్వాత 2007, 2011, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచులు జరగలేదు..

2019 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో ఇండియా- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. సెమీ ఫైనల్‌లో టీమిండియాని 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది న్యూజిలాండ్..


dhoni neesham

‘2011 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోయాం. లీగ్ స్టేజీలో సౌతాఫ్రికా మ్యాచ్‌లో భారత జట్టు గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి...

‘‘చూడండి.. కొన్ని సార్లు లీగ్ ఫార్మాట్‌లో ఓ మ్యాచ్ ఓడిపోవడం మంచిదే. ఎందుకంటే లీగ్ స్టేజీలో వరుసగా అన్ని మ్యాచులు గెలిస్తే, సెమీ ఫైనల్‌లో, లేదా ఫైనల్‌లో టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలో అర్థం కాదు..
 

Dhoni-Kohli-Ravi Shastri

వరుస విజయాల తర్వాత పెరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్‌ని ఈ పరాజయం తగ్గిస్తుంది. మరింత జాగ్రత్తగా ఆడేలా చేస్తుంది. లేదంటే ఫైనల్‌లో, సెమీస్‌లో వణకాల్సి రావచ్చు..’’ అన్నాడు ధోనీ..

ధోనీ మాటలు, టీమ్‌లో పాజిటివ్ ఎనర్జీని నింపాయి. అందుకే క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఎదుర్కోవాల్సి వచ్చినా టీమిండియా కాన్ఫిడెన్స్ అస్సలు తగ్గలేదు. ఆ తర్వాత పాకిస్తాన్‌ని సెమీ ఫైనల్‌లో, శ్రీలంకను ఫైనల్‌లో ఓడించి టైటిల్ గెలిచాం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

Latest Videos

click me!