కేకేఆర్ మాజీ బౌలింగ్‌ కోచ్‌పై 8 ఏళ్ల బ్యాన్ వేసిన ఐసీసీ... జింబాబ్వే మాజీ కెప్టెన్ హేత్ స్ట్రేక్‌‌పై...

First Published Apr 14, 2021, 6:55 PM IST

జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హేత్ స్ట్రేక్‌పై 8 ఏళ్ల నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). 2017, 2018 ఏడాదుల్లో జరిగిన మ్యాచుల్లో, అంతకుముందు జింబాబ్వేకి కోచ్‌గా వ్యవహారించిన సమయంలోనూ టీ20 లీగుల్లో అవినీతికి పాల్పడినట్టు అంగీకరించాడు హేత్ స్ట్రేక్...

ఐపీఎల్‌తో పాటు, బంగ్లా ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్‌లకు సంబంధించిన సమాచారాన్ని బుకీలకు అందివ్వడంతో పాటు కొందరు ప్లేయర్లను వారికి పరిచయం చేసినట్టు అంగీకరించాడు హేత్ స్ట్రేక్.
undefined
ఓ జాతీయ జట్టు కెప్టెన్‌తో పాటు నలుగురు ప్లేయర్లను బుకీలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించడట హేత్ స్ట్రేక్. ఇందుకోసం బిట్ కాయిన్స్, మొబైల్ పేమెంట్స్ రూపంలో దాదాపు 35 వేల డాలర్లు... హేత్ స్ట్రేక్‌కి అందినట్టు ఐసీసీ విచారణలో తేలింది...
undefined
బుకీని అదుపులోకి తీసుకున్న ఐసీసీ విచారించగా...ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేత్ స్ట్రేక్ భార్యకి కూడా కొత్త ఐఫోన్ కొనిచ్చినట్టు తేలింది.. 90ల్లో జాతీయ జట్టుకి ఆడిన హేత్ స్ట్రేక్, వన్డేల్లో 237 వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 2000 ఏడాదిలో జింబాబ్వేకి కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు...
undefined
జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్‌ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా కూడా వ్యవహారించిన హేత్ స్ట్రేక్, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారించాడు...
undefined
ఇలా వివిధ పొజిషన్లలో ఉన్న సమయంలో జట్టు కూర్పు, ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని బుకీలకు అందవేశాడు హేత్ స్ట్రేక్... ముఖ్యంగా 2018లో జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ట్రై సిరీస్‌కి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి, అవినీతికి పాల్పడ్డాడు హేత్ స్ట్రేక్..
undefined
click me!