స్టార్ ప్లేయర్లు ఏం చేయలేరు! టీమిండియాకి అతనితోనే అసలు సమస్య... సామ్ కుర్రాన్‌ ఏం చేస్తాడోనని...

First Published | Nov 7, 2022, 5:26 PM IST

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో భారత జట్టు, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు నిండి ఉండడంతో హోరాహోరీ ఫైట్ చూడొచ్చని అనుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. టీమిండియా మాత్రం ఒకే ఒక్క ప్లేయర్ విషయంలో ఆందోళన చెందుతోంది...  అతనే సామ్ కుర్రాన్...

ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌కి టీమిండియాపై తిరుగులేని రికార్డు ఉంది. 2021 టీమిండియా పర్యటనలో జరిగిన మూడో వన్డేలో 5 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీసిన సామ్ కుర్రాన్, 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 పరుగులు చేసి భారీ లక్ష్యఛేదనలో ఆఖరి వరకూ ఒంటరి పోరాటం చేశాడు...
 

2018 ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీమిండియాకి విజయాలను దూరం చేసింది సామ్ కుర్రానే. జోస్ బట్లర్, మొయిన్ ఆలీ, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోన్స్, డేవిడ్ మలాన్ వంటి ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లకు ఇండియాపై చెప్పుకోదగ్గ రికార్డు ఏమీ లేదు. వీళ్లని అవుట్ చేయడం మనవాళ్లకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కూడా...
 


Sam Curran

అయితే చిచ్చరపిడుగు సామ్ కుర్రాన్ మాత్రం టీమిండియాపై తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశాడు. భారత జట్టుపై 7 టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 346 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. ఏ జట్టుపైన ఇలాంటి రికార్డు లేదు సామ్‌కి...

Harry Brook-Sam Curran

టీమిండియాపై 3 వన్డేల్లో 107 సగటుతో 107 పరుగులు చేశాడు. అయితే టీ20ల్లో మాత్రం సామ్ కుర్రాన్‌కి టీమిండియాపై చెప్పుకోదగ్గ రికార్డు లేదు. భారత జట్టుపై 7 టీ20 మ్యాచులు ఆడిన సామ్ కుర్రాన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 14 నాటౌట్.. బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు...

ఐపీఎల్‌లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేసిన అనుభవంతో పాటు భారత బౌలర్లను ఎదుర్కొన్న ఈ కుర్రాడు, గాయం కారణంగా 2022 సీజన్ ఆడలేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకి సామ్ కుర్రాన్ ఎలాంటి నష్టం చేకూరుస్తాడని భయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 4 మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. ఆఫ్ఘాన్‌పై 5 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

Latest Videos

click me!