BCCI Central contracts : పంత్ పంట పండిందిపో... ఐపిఎల్ లో రూ.27 కోట్లు, మరి బిసిసిఐ నుండి ఎంతొస్తుందో తెలుసా?

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కు ఈ ఏడాది అంతా కలిసివస్తోంది. ఇప్పటికే అతడు ఐపిఎల్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్నాడు.. ఇప్పుడు బిసిసిఐ కూడా అతడికి ప్రమోషన్ ఇచ్చింది. దీంతో అతడి ఆదాయం మరింత పెరిగింది. బిసిసిఐ నుండి పంత్ ఎంత సాలరీ పొందనున్నాడో తెలుసా? అలాగే టీమిండియా ఆటగాళ్లలో ఎవరి జీతం ఎంత? 

BCCI Central Contracts 2025: Rishabh Pant Promoted, Full Player List Revealed in telugu akp
BCCI Central contracts

BCCI Central contracts : అదృష్టమంటే టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ది. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసి లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్పీ బాధ్యతలు అప్పగించారు. ఇలా ప్రస్తుతం ఐపిఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్న పంత్ కు బిసిసిఐ కూడా బంపరాఫర్ ఇచ్చింది. బిసిసిఐ నిర్ణయంతో పంత్ కు మరో రూ.5 కోట్లు కలిసివస్తున్నాయి. ఇలా ఐపిఎల్, బిసిసిఐ కాంట్రాక్ట్ ద్వారా పంత్ భారీగా సంపాదిస్తున్నాడు... స్టార్ ఆటగాళ్లకు దక్కని అవకాశాలు పంత్ కు వస్తున్నాయి. 

తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ 2024-25 వార్షిక కేంద్ర కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్ళు ఉన్నారు. నలుగురు ఆటగాళ్లకు A+ గ్రేడ్, ఆరుగురికి A గ్రేడ్, ఐదుగురికి B గ్రేడ్, 19 మందికి C గ్రేడ్ లభించింది. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి కొత్త ఆటగాళ్ళు జట్టులోకి వచ్చారు. వీళ్ళందరికీ C గ్రేడ్ లభించింది. రిషబ్ పంత్ B గ్రేడ్ నుండి A గ్రేడ్ కి ప్రమోట్ అయ్యాడు. అంటే ఇంతకాలం అతడు బిసిసిఐ నుండి రూ.3 కోట్లు అందుకుంటే ఇకపై రూ.5 కోట్లు అందుకోనున్నాడు. 

ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వస్తారా లేదా అనే అనుమానాలున్నాయి.. ఈ సమయంలో ఇద్దరు ఆటగాళ్లకు బిసిసిఐ కేంద్ర కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. 2023-24 కాంట్రాక్ట్ జాబితాలో ఇద్దరూ ఉన్నారు... కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల కాంట్రాక్ట్ రద్దు అయ్యింది. బిసిసిఐ రూల్స్ ప్రకారం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే వారి కాంట్రాక్ట్ రద్దకు ప్రధాన కారణం. 

అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు... ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్లో కూడా అతని బ్యాట్ నుండి పరుగులు వచ్చాయి. అదేవిధంగా ఇషాన్ కూడా దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడాడు. దీంతో వారిని తిరిగి కాంట్రాక్ట్ జాబితాలో చేర్చారు.

Rohit Sharma, Virat Kohli

రోహిత్, కోహ్లీ, జడేజాలకు బిసిసిఐ ఇచ్చే సాలరీ ఎంత? 

టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అయినప్పటికీ బిసిసిఐ వారిని A+ గ్రేడ్‌లో ఉంచింది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు రాబోయే కొంతకాలం వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రణాళికలో భాగంగా ఉంటారు. ఇందుకోసం వీరికి రూ.7 కోట్ల సాలరీ ఇస్తుంది బిసిసిఐ.

ఈ కొత్త కేంద్ర కాంట్రాక్ట్ అక్టోబర్ 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది. ఈకాలంలో వారివారి గ్రేడ్ ఆధారంగా బిసిసిఐ నుండి డబ్బులు లభిస్తాయి. 


Rishabh Pant

పంత్ కు ప్రమోషన్

బిసిసిఐ విడుదల చేసిన కొత్త కేంద్ర కాంట్రాక్ట్ జాబితాలో ఆటగాళ్ల లాభనష్టాల గురించి మాట్లాడితే... ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌ను కాంట్రాక్ట్ నుండి తొలగించారు. శార్దూల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్‌లను కూడా జాబితా నుండి తొలగించారు, ఎందుకంటే వారు గత ఏడాదిలో టీమ్ ఇండియా తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. జితేష్ శర్మ కూడా తన స్థానాన్ని కోల్పోయాడు, దీనికి ప్రధాన కారణం సంజు శాంసన్ జట్టులో ఉండటమే. కెఎస్ భరత్ కూడా జాబితా నుండి బయటకు వెళ్లిపోయాడు.  అయితే రిషభ్ పంత్‌కు మాత్రం ప్రమోషన్ లభించింది... అతన్ని B గ్రేడ్ నుండి A గ్రేడ్‌కు మార్చారు.
 

Team India

2024-25 సంవత్సరానికి ఏ ఆటగాడు ఏ గ్రేడ్ లో : 

A+ గ్రేడ్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా
A గ్రేడ్ : మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ
B గ్రేడ్ : సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్
C గ్రేడ్ : రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఈషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

A+ గ్రేడ్ లో ఎలాంటి మార్పులు లేవు... రూ.7 కోట్ల వార్షిక కాంట్రాక్ట్ గల ఈ గ్రేడ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నారు. ఈ కేటగిరీ అన్ని ఫార్మాట్లలో ఆడే కీలక ఆటగాళ్లకు ప్రత్యేకం.

కారు ప్రమాదం నుండి పూర్తిగా కోలుకుని టీమిండియా లో చేరిన పంత్ గతంలో B గ్రేడ్ లో ఉంటే ప్రస్తుతం A గ్రేడ్ (రూ.5 కోట్లు) లో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పంత్ వచ్చాడు. బిసిసిఐ నలుగురు కొత్త ఆటగాళ్లకు C గ్రేడ్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది... వీరిలో మన తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రానా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. 

BCCI Central contracts

బిసిసిఐ ఏ కాంట్రాక్ట్ ఆటగాడికి ఎన్ని డబ్బులు ఇస్తుంది... 

A+ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.7 కోట్లు 

A గ్రేడ్ ఆటగాళ్లకు రూ.5 కోట్లు  

B గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు 

C గ్రేడ్ ఆటగాళ్లకు రూ.1 కోటి 

Latest Videos

vuukle one pixel image
click me!