ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు! రోహిత్ శర్మ, కివీస్ గండాన్ని దాటగలడా... వన్డే వరల్డ్ కప్‌ 2023లో..

First Published | Oct 21, 2023, 4:47 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్నాయి టీమిండియా, న్యూజిలాండ్. టాప్‌లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది..

Rohit Sharma

ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కి టీమిండియాపై ఘనమైన రికార్డు ఉంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు తలబడగా 3 సార్లు భారత జట్టు, 5 సార్లు న్యూజిలాండ్ గెలిచాయి...

Rohit Sharma

1975, 1979 టోర్నీల్లో న్యూజిలాండ్, భారత జట్టుపై వరుస విజయాలు అందుకుంది. అయితే 1987లో గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ని 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్, నాకౌట్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓడించింది..

Latest Videos


1992లో న్యూజిలాండ్, 4 వికెట్ల తేడాతో భారత్‌ని ఓడించి తిరిగి ఆధిక్యాన్ని చాటుకుంది. 1999లోనూ భారత్‌పై కివీస్‌దే గెలుపు. 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకి న్యూజిలాండ్‌పై దక్కిన ఆఖరి విజయం ఇదే..

2019లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..
 

వన్డే వరల్డ్ కప్‌లోనే కాదు టీ20 వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోనూ న్యూజిలాండ్, టీమిండియాకి షాక్ ఇచ్చింది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, టీమిండియాపై 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

2016లో మరోసారి న్యూజిలాండ్- ఇండియా గ్రూప్ స్టేజీలో తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో నెగ్గిన న్యూజిలాండ్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో 8 వికెట్ల తేడాతో భారత జట్టును చిత్తు చేసింది... 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టుకి షాక్ ఇచ్చి, టైటిల్ కైవసం చేసుకుంది..

India vs New Zealand

2003 వన్డే వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై విజయం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీలో 2 సార్లు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు సార్లు కివీస్ చేతుల్లో పరాజయం పాలైంది.. 

India vs New Zealand

ఆదివారం న్యూజిలాండ్‌పై మ్యాచ్ గెలిస్తే, 20 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌‌ని ఓడించిన భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు రోహిత్ శర్మ. ఓ రకంగా న్యూజిలాండ్‌పై గెలిస్తే, టీమిండియా దాదాపు సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్టే అవుతుంది..

ఎందుకంటే ఆ తర్వాత ఇంగ్లాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఈ నాలుగు జట్లలో భారత జట్టుకి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మాత్రమే పోటీ ఇవ్వగల టీమ్స్.  కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే వీటిపై గెలవడం భారత్‌కి పెద్ద కష్టమేమీ కాదు.. 
 

click me!