టాపార్డర్‌లో శార్దూల్ ఠాకూర్‌ని పంపాలనుకున్న రోహిత్ శర్మ... అలా చెప్పగానే వికెట్ పడడంతో...

First Published | Oct 21, 2023, 3:37 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి, పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది భారత జట్టు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

న్యూజిలాండ్ కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. అదీకాకుండా భారత జట్టు, న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలిచి 20 ఏళ్లు అవుతోంది. 

2003 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ని ఓడించిన టీమిండియా, ఆ తర్వాత కివీస్‌పై ఐసీసీ మ్యాచ్ గెలవలేకపోయింది..


బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ 48, కెఎల్ రాహుల్ 34 పరుగులతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత్. 

Image credit: PTI

అయితే కెఎల్ రాహుల్ కంటే ముందే శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్‌కి పంపాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడట..

Shardul Thakur

‘శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయితే, శార్దూల్ ఠాకూర్‌ని పంపాలని అనుకున్నా. వెళ్లి, ‘శార్దూల్.. వికెట్ పడితే నువ్వే వెళ్లాలి’ అని చెప్పాను. అలా చెప్పానో లేదో తర్వాతి బాల్‌కే శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయ్యాడు...
 

శ్రేయాస్ అయ్యర్ రెఢీ అయ్యేలోపు కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి వెళ్లిపోయాడు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చూడాలని అభిమానులను కోరుకుంటున్నారని శుబ్‌మన్ గిల్ కామెంట్ చేశాడు. దీనికి రోహిత్ శర్మ.. ‘వాళ్లకు ఆ ఛాన్స్ కచ్ఛతంగా వస్తుంది. అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్..’ అంటూ నవ్వేశాడు శార్దూల్ ఠాకూర్...

హార్ధిక్ పాండ్యా గాయంతో బాధపడుతుండడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ లేదా మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.. 

Latest Videos

click me!