టెండూల్కర్‌కి 20 ఏళ్లు పట్టింది! అలా ఆడితే కోహ్లీ, రోహిత్ కూడా వరల్డ్ కప్ గెలుస్తారు... అశ్విన్ కామెంట్

First Published Jan 29, 2023, 1:49 PM IST

కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2019, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017, టీ20 వరల్డ్ కప్ 2021, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన భారత జట్టు... టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది... ఇదే కోహ్లీ కెప్టెన్సీ కోల్పోవడానికి కారణమైంది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కెప్టెన్సీ చేయాలని అనుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే సెలక్టర్లు, బీసీసీఐ బలవంతంగా విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అది జరగలేదు..

Sachin Tendulkar

‘ఐసీసీ టైటిల్ గెలవడం అంత తేలికైన విషయం కాదు. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, మరో వన్డే వరల్డ్ కప్ కోసం 28 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ కూడా 1992, 1996, 1999, 2003, 2007 వన్డే వరల్డ్ కప్స్‌లో టైటిల్ గెలవలేకపోయారు...

ఆఖరికి 2011 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్ కల నెరవేరింది. వరల్డ్ కప్ గెలవడానికి సచిన్, 6 వరల్డ్ కప్స్ దాకా ఎదురుచూడాల్సి వచ్చింది. భారత క్రికెట్‌లో పరిస్థితి అలా ఉంటుంది...


ధోనీ వచ్చాడు, టపాటపా వరల్డ్ కప్స్ గెలిచాడని అందరూ అలా గెలవాలని లేదు. ధోనీ కూడా 2015,2019 వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ, 2007 టీ20 వరల్డ్ కప్ ఆడలేదు...

రోహిత్ శర్మ, 2007 వన్డే వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ మాత్రమే 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్స్ ఆడాడు. కోహ్లీ, ఐసీసీ టైటిల్ గెలవలేదని చాలామంది అంటారు...

అయితే 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో కోహ్లీ ఉన్న విషయం మరిచిపోయారా? 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఉన్నారు. ద్వైపాక్షిక సిరీసులు, ఐపీఎల్, ఇంకా ఎన్నో టోర్నీలు ఆడుతున్నారు. వారికి కాస్త సమయం కావాలి..

సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత అలాంటి ప్లేయర్ వస్తాడా? అనుకున్నాం. విరాట్ కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ అయితే ఎవరొస్తారని అంటున్నారు. చాలామంది కనిపిస్తున్నారు..

Image credit: Getty

శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇప్పటికే తాము ఏం చేయగలమో నిరూపించుకున్నారు. అయితే కోహ్లీలా మారాలంటే ఒక్క రోజులోనో, ఒక్క మ్యాచ్‌లోనే జరిగే పని కాదు, కొన్ని ఏళ్ల పాటు నిలకడగా రాణించాలి... ’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..

click me!