నేను శుబ్‌మన్ గిల్‌ బ్యాటింగ్‌‌కి అభిమానినే! అయితే టీ20లకు అతను పనికి రాడు... - మహ్మద్ అజారుద్దీన్...

First Published Jan 29, 2023, 1:01 PM IST

టెస్టుల్లో చూపించిన పర్ఫామెన్స్ కారణంగా వన్డేల్లోకి, వన్డేల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా టీ20ల్లోకి వచ్చాడు శుబ్‌మన్ గిల్. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టారని ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లను టీ20ల్లో ఓపెనర్లుగా వాడుతోంది టీమిండియా. అయితే ఇది సరైన ఫలితాలను ఇవ్వడం లేదు...
 

Image credit: PTI

టీ20 ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు శుబ్‌మన్ గిల్. మొదటి నాలుగు మ్యాచుల్లో 100+ స్ట్రైయిక్ రేటుతో కూడా బ్యాటింగ్ చేయలేక అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు...

Image credit: PTI

‘శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం. అతనిలో చాలా టాలెంట్ ఉంది. గిల్ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాను. ఎంతో ఫ్రీగా బ్యాటింగ్ చేస్తాడు.  ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్...
 

Image credit: PTI

ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి స్ట్రైయికర్. అతను ఆడే షాట్స్ చాలా స్ట్రైలిష్‌గా ఉంటాయి. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ కూడా భవిష్యత్తులో టీమిండియాకి రెండు పిల్లర్లుగా మారతారు. ఈ ఇద్దరిలో చాలా టాలెంట్ ఉంది...
 

Image credit: PTI

అయితే శుబ్‌మన్ గిల్‌లో ఎంత టాలెంట్ ఉన్నా, అతను టీ20లకు పనికి రాడు. టీ20ల్లో మొదటి బంతి నుంచి హిట్టింగ్ చేసే బ్యాటర్లు కావాలి. వన్డేల్లో ఓపెనర్లు కుదురుకోవడానికి సమయం తీసుకుంటే పర్లేదు, కానీ టీ20ల్లో అంత సమయం ఉండదు.. 

పొట్టి ఫార్మాట్‌కి దూకుడు అవసరం... శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ స్టైల్‌కి అది సెట్ అవ్వదు. అతను ఐపీఎల్‌లో ఆడినట్టు, టీమిండియాకి ఆడతానంటే సెట్ అవ్వదు. అందుకే అతన్ని టీ20 ఫార్మాట్‌కి దూరం పెడితేనే బెటర్... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్.. 

click me!