సచిన్ టెండూల్కర్ వల్లే మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు... - మాజీ సెలక్టర్ శరద్ పవార్...

First Published Mar 8, 2021, 12:46 PM IST

సౌరవ్ గంగూలీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రావిడ్, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావించాడు. సచిన్ టెండూల్కర్ అప్పటికే కెప్టెన్‌గా విఫలం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు... అయితే అప్పటికే జట్టులో చాలామంది సీనియర్లు ఉన్నా, మూడేళ్లు అనుభవం కూడా లేని ధోనీకి కెప్టెన్సీ దక్కింది. దీనికి కారణం సచిన్ టెండూల్కర్ సలహాయేనట...

2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు, గ్రూప్ దశ నుంచి నిష్కమించింది. బంగ్లాదేశ్‌ చేతిలో ఊహించని పరాజయం ఎదుర్కొన్న భారత జట్టు, నాకౌట్ దశకు కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో భారత జట్టుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి...
undefined
2004 నుంచి స్టార్‌గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోనీ ఇంటిపై టీమిండియా అభిమానులు దాడి చేశారు. అతనితో పాటు సచిన్, రాహుల్ ద్రావిడ్ వంటి స్టార్ల ఫోటోలను దిష్టిబొమ్మలుగా చేసి, తగులబెట్టారు... భారత జట్టుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
undefined
2007 వన్డే వరల్డ్‌కప్ పరాజయం తర్వాత ఇకపై టీమిండియాకు కెప్టెన్‌‌గా కొనసాగడం ఇష్టం లేదని సెలక్టర్లకు చెప్పేశాడు రాహుల్ ద్రావిడ్. దాంతో సెలక్టర్లు డైలమాలో పడ్డారు...
undefined
‘2007లో రాహుల్ ద్రావిడ్‌ టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌ టూర్‌కి పయనం కావాల్సి ఉంది. ఇంగ్లాండ్‌కి వెళ్లాక ద్రావిడ్ నన్ను కలవడానికి వచ్చాడు. ఇక భారత జట్టును నడిపించడం తన వల్ల కాదని చెప్పాడు ద్రావిడ్....
undefined
కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తన బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని చెప్పాడు రాహుల్ ద్రావిడ్. అప్పుడు మేం సచిన్ టెండూల్కర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావించాం. కానీ సచిన్ కూడా కెప్టెన్సీ తీసుకోవడానికి ఇష్టపడలేదు...
undefined
‘‘మీరు ఇద్దరూ టీమిండియాలో సీనియర్ మోస్ట్ ప్లేయర్లు, మీరే కెప్టెన్సీ తీసుకోవడానికి ఇష్టపడకపోతే భారత జట్టును ఎవరు నడిపిస్తారు...’’ అని సచిన్ టెండూల్కర్‌ని అడిగాను... అప్పుడు సచిన్ టెండూల్కర్, ధోనీ పేరు చెప్పాడు...
undefined
‘‘భారత జట్టును నడిపించగల సత్తా టీమిండియాలో ఓ ప్లేయర్‌కి ఉంది... అతనే మహేంద్ర సింగ్ ధోనీ...’’ అంటూ సమాధానం చెప్పాడు టెండూల్కర్. దాంతో మేం ధోనీకి కెప్టెన్సీ అప్పగించాం...’ అంటూ చెప్పుకొచ్చాడు అప్పటి బీసీసీఐ సెలక్టర్ శరద్ పవార్.
undefined
2007లో సౌతాఫ్రికాలో టీ20 సిరీస్‌కు మొట్టమొదటగా ధోనీకి కెప్టెన్సీ అప్పగించారు సెలక్టర్లు. వన్డేలకు మాత్రం రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో టీ20 వరల్డ్‌కప్‌కి ధోనీని పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించారు సెలక్టర్లు..
undefined
టెస్టు కెప్టెన్సీని మాత్రం అనిల్ కుంబ్లేకి అప్పగించారు. కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఆ బాధ్యతలు కూడా ధోనీకే దక్కాయి. అనుకోకుండా దక్కిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే..
undefined
click me!