నా పేరు చెప్పుకొని మీరు మందు కొట్టండి... ట్రోల్స్‌పై రవిశాస్త్రి స్పందన...

First Published Mar 8, 2021, 11:21 AM IST

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి మీద వచ్చినన్ని మీమ్స్, జోక్స్ మరో క్రికెట్ సెలబ్రిటీ మీద వచ్చి ఉండవు. టీమిండియా ఓడిన ప్రతీసారి, ట్రోల్ చేసే వారికి టార్గెట్ అయ్యేది రవిశాస్త్రియే. తాజాగా తనపై వస్తున్న జోక్స్, మీమీలపై స్పందించాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి...

భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో భారత జట్టుకి కోచ్‌గా నియమితుడైన భారత మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి, వన్డే వరల్డ్‌కప్ 2019 సమయంలో తాగిన మత్తులో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
undefined
సీరియస్‌గా మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెవిలియన్‌లో నిద్రపోతూ కనిపించడం, ఆడిలైడ్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఏమీ చెప్పలేదని రవిశాస్త్రి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.
undefined
అప్పటి నుంచి రవిశాస్త్రి, నెటిజన్లకు టార్గెట్ అయిపోయాడు. భారత జట్టు ఎప్పుడు ఓడినా, మొట్టమొదట విమర్శలు ఎదుర్కొనేది రవిశాస్త్రియే. ఆయనకున్న మందు అలవాటును కారణంగా చూపిస్తూ, జోక్స్, మీమీలతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తాయి...
undefined
భారత జట్టు విజయాలు సాధించినప్పుడు మాత్రం రవిశాస్త్రికి దక్కిన క్రెడిట్ అంతంత మాత్రమే. గత ఆస్ట్రేలియా పర్యటనలో యంగ్ ప్లేయర్లు అదరగొడితే, ఆ క్రెడిట్ మొత్తం భారత మాజీ క్రికెటర్, అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్‌కే వెళ్లింది...
undefined
తాజాగా కరోనా తొలి విడత వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను పోస్టు చేశాడు రవిశాస్త్రి. ఇందులో కూడా ఆయన కళ్లు మత్తులో తేలుతున్నట్టు కనిపించడంతో మరోసారి ఆయన్ని టార్గెట్ చేశారు నెటిజన్లు...
undefined
‘చాలామంది నాపై మీమీలు, జోక్స్ వేస్తూ ఉంటారు. కేవలం ఫన్ కోసమే వాళ్లు ఈ పని చేస్తారని తెలుసు. అందుకోసం నన్ను వాడుకుంటారు... పర్లేదు...
undefined
వాళ్లని నా పేరు చెప్పుకుని డ్రింక్ తాగనివ్వండి... ఇలాంటి మీమ్స్, జోక్స్ పోస్టు చేసినప్పుడు చాలామంది వాటిని చూసి నవ్వుతారు... ఎంజాయ్ చేయండి, ఇవి నాపైన ఎలాంటి ప్రభావం చూపవు...
undefined
క్రికెట్‌లో సరిగ్గా ఆడుతూ విజయాలు అందుకుంటున్నప్పుడు అందరూ నీతో సంతోషంగానే ఉంటారు... ఓటములు ఎదరైనప్పుడు విమర్శలు, చివాట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి...
undefined
పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన తర్వాత... ‘మీరేమనుకున్నారు. డ్రై స్టేట్‌లో నేను ఐదు రోజులు ఉంటానా..’ అంటూ ఓ మహిళా జర్నలిస్టు పోస్టు చేసిన మీమీకి సానుకూలంగా స్పందించాడు రవిశాస్త్రి...
undefined
‘ఈ పరిహాసం నాకు బాగా నచ్చింది... ఈ కష్ట సమయంలో చాలామంది ముఖాల మీద నవ్వులు తెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...
undefined
click me!