గంగూలీ షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకున్నదే మీకు తెలుసు, కానీ దాని వెనక... - సచిన్ టెండూల్కర్

Published : Jul 15, 2022, 03:32 PM IST

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ పేరు చెప్పగానే భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి గుర్తుకు వచ్చేది సౌరవ్ గంగూలీ సెలబ్రేషన్స్. ఇంగ్లాండ్‌పై ఉత్కంఠ విజయం సాధించిన తర్వాత అప్పటి సారథి సౌరవ్ గంగూలీ, లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పి సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్‌కి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఇప్పటిదాకా మరిచిపోలేదు...  

PREV
18
గంగూలీ షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకున్నదే మీకు తెలుసు, కానీ దాని వెనక... - సచిన్  టెండూల్కర్
Sourav Ganguly

2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో భారత జట్టు, ఇంగ్లాండ్‌పై 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. జూలై 13తో ఈ విజయానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, కొన్ని ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు...

28

‘25వ ఓవర్ ముగిసే సమయానికి మేం 5 వికెట్లు కోల్పోయాం. అప్పటికే కీలక వికెట్లు కోల్పోవడంతో మేం చాలా నిరుత్సాహపడ్డాం. అదీకాక క్రీజులో ఉన్న ఇద్దరూ కూడా కుర్రాళ్లు. యువరాజ్ సింగ్ అప్పటికీ రెండేళ్ల ముందు నుంచే ఆడుతున్నాడు...

38

మహ్మద్ కైఫ్ అప్పుడప్పుడే టీమ్‌లోకి వచ్చాం. అయితే ఈ ఇద్దరూ ఆడిన విధానం అద్భుతం. బౌండరీలు కొడుతూ , డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్‌లు పంపించారు. మేం సైన్ సిగ్నల్ ద్వారా వారికి సంకేతాలు ఇచ్చాం...

48

యువీ అటాకింగ్ గేమ్ ఆడుతున్నప్పుడు మహ్మద్ కైఫ్ సపోర్టింగ్ రోల్ పోషించాడు. యువీ అవుటైన తర్వాత కైఫ్ అటాకింగ్ రోల్ తీసుకున్నాడు. చివరిదాకా క్రీజులో ఉండి మ్యాచ్ ముగించాడు...

58

చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌. డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తున్న మేం, మ్యాచ్ అయ్యే వరకూ ఎవ్వరూ వాళ్ల పొజిషన్ నుంచి కదలకూడదని నిర్ణయించుకున్నాం. టీమ్‌లో అందరికీ నేనే విషయాలు చెబుతున్నా...

68
Mohammad Kaif

మ్యాచ్ అయ్యాక జెర్సీ విప్పి సెలబ్రేట్ చేసుకున్నదే అందరికీ తెలుసు. అయితే దాని వెనక ఎవ్వరికీ తెలియని మరో విషయం ఉంది. యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ మ్యాచ్ తర్వాత నా దగ్గరికీ వచ్చారు...

78
Mohammad Kaif

‘పాజీ, మేం బాగా ఆడాం కానీ దీనికంటే బాగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఏం చేయగలం చెప్పండి...’ అని అడిగారు... నేను వారి మాటలకు ఆశ్చర్యపోయా...

88

‘మీరు టీమిండియాకి టోర్నమెంట్ గెలిచి ఇచ్చారు. ఇంతకంటే ఏం కోరుకుంటాం. ఇదే చేస్తూ ఉండండి, భారత క్రికెట్‌కి అది చాలు... ’ అని చెప్పాను. అప్పటి నుంచి వాళ్లెప్పుడూ మమ్మల్ని డిస్సప్పాయింట్ చేయలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్...

click me!

Recommended Stories