స్టేడియంలో సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లతో ఎమ్మెస్ ధోనీ... రెండో వన్డేలో టీమిండియా ఓటమికి..

First Published Jul 15, 2022, 1:23 PM IST

మనవాళ్లు బాగా ఆడుతున్నారు కదా అని మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళితే, ఆ మ్యాచ్‌లో కాస్తా బొక్కబోర్లా పడుతోంది టీమిండియా. ఇది సాధారణ ఫ్యాన్స్ విషయంలోనే కాదు, సెలబ్రిటీల విషయంలోనూ జరుగుతోంది... ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నాడు.. 

ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బొక్కబోర్లా పడింది. 247 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...

MS Dhoni

అయితే ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ నెల ఆరంభంలో కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లిన ఎమ్మెస్ ధోనీ, టీమిండియా ఆడిన మూడో టీ20 మ్యాచ్‌కి వెళ్లాడు...

Latest Videos


ఆ సమయంలో కామెంటరీ బాక్సులో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో ముచ్చటించిన ఎమ్మెస్ ధోనీ, ఇప్పుడు హిందీ కామెంటరీ బాక్సులో ఉన్న భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనాలను కలిసి మాట్లాడాడు...

MSD And Raina

పర్ఫెక్ట్ ఫిజిక్‌తో టీ షార్టులో మెరిసిపోతున్న ఎమ్మెస్ ధోనీ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫుల్లు ఖుష్ అవుతున్నారు. మాహీతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా రెండో వన్డేకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు...

అయితే మహేంద్ర సింగ్ ధోనీ వచ్చిన మూడో టీ20లో పోరాడి ఓడిన భారత జట్టు, రెండో వన్డేలోనూ ఓటమిపాలు కావడంతో మాహీ వస్తే మ్యాచ్ పోయినట్టే అంటూ ఓ సెంటిమెంట్‌ని తెగ వైరల్ చేస్తున్నారు ఆయన హేటర్స్...

‘మిస్టర్ ఐపీఎల్’గా పేరుగాంచి, చెన్నై సూపర్ కింగ్స్‌ మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌కి కామెంటేటర్‌గా సేవలు అందించిన రైనా, ఇంగ్లాండ్ టూర్‌లోనూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

click me!