సంజూ శాంసన్‌పై ఎందుకింత పక్షపాతం... ఏడేళ్ల నుంచి ఆడుతున్నా, డజను మ్యాచుల్లో మాత్రమే...

Published : Jul 15, 2022, 12:27 PM IST

2021లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే 19 టీ20 మ్యాచులు ఆడేశాడు. అతని టీమ్‌మేట్ ఇషాన్ కిషన్ కూడా 18 మ్యాచులు ఆడేశాడు. సగం ఐపీఎల్‌ పర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ చేసి టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్ కూడా 9 టీ20లు ఆడాడు. అయితే అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్ మాత్రం ఇప్పటిదాకా ఆడింది 14 మ్యాచులే...

PREV
110
సంజూ శాంసన్‌పై ఎందుకింత పక్షపాతం... ఏడేళ్ల నుంచి ఆడుతున్నా, డజను మ్యాచుల్లో మాత్రమే...
Sanju Samson

2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, తన మొదటి మ్యాచ్‌లో 19 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో 10 పరుగుల తేడాతో ఓడింది భారత జట్టు. దీంతో మళ్లీ ఐదేళ్ల వరకూ సంజూ శాంసన్‌ని పట్టించుకోలేదు సెలక్టర్లు... 

210
Sanju Samson

2020 జనవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఓ టీ20 మ్యాచ్, ఫ్రిబవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 2 టీ20 మ్యాచులు, ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై 3 టీ20 మ్యాచులు ఆడించింది భారత జట్టు... 

310
Sanju Samson

మళ్లీ ఏడు నెలలకు ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నప్పుడు శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సంజూ శాంసన్ 3 టీ20లు ఆడాడు. మళ్లీ 8 నెలలకు 2022 ఫిబ్రవరిలో లంకతో టీ20 సిరీస్‌లో 2 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, ఐర్లాండ్‌పై ఓ టీ20 ఆడాడు...

410
Sanju Samson

మొత్తంగా సంజూ శాంసన్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే 2015లో ఆరంగ్రేటం మ్యాచ్ తర్వాత 2020లో ఆరు టీ20లు ఆడిన సంజూ, 2021లో మూడు, 2022లో మూడు టీ20లు మాత్రమే ఆడాడు..

510
Sanju Samson

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులాడి ఓ సెంచరీతో 484 పరుగులు చేసిన సంజూ శాంసన్, 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 458 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ని ఐపీఎల్ 2022 ఫైనల్‌కి చేర్చాడు. 

610
Sanju Samson with DK

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 77 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేశాడు సంజూ. అయినా సంజూ శాంసన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే జట్టుకి పరిగణించడం లేదు బీసీసీఐ... 

710
Sanju Samson

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కేవలం మొదటి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నా, తుదిజట్టులోకి ప్లేస్ కోల్పోయిన సంజూ శాంసన్, వెస్టిండీస్‌ టూర్‌లోనూ ప్లేస్ సంపాదించుకోలేకపోయాడు... 

810

దేశవాళీ టోర్నీల్లో టీ20ల్లో 5 వేలకు పైగా పరుగులు చేసిన సంజూ శాంసన్, ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే అతనికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదనేది వాస్తవం.. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులోనూ సంజూ శాంసన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

910

దీపక్ హుడా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూ శాంసన్ చేస్తున్న పరుగులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది భారత జట్టు తరుపున మూడు టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మూడో టీ20లో 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టాడు... 

1010

Sanju Samson

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రిషబ్ పంత్ డకౌట్ కావడంతో మరోసారి సంజూ శాంసన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. రిషబ్ పంత్ కంటే సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఇవ్వడం న్యాయమంటూ డిమాండ్ చేస్తున్నారు అతని అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories