వైస్ కెప్టెన్‌గా చేయమన్నా, వాళ్లేమో నన్ను పీకేసి... సౌరవ్ గంగూలీతో స్నేహం గురించి టెండూల్కర్..

Published : Jul 08, 2022, 04:18 PM IST

టీమిండియా దశ, దిశా మార్చిన సారథి సౌరవ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, వరుస వైఫల్యాలు, కెప్టెన్సీ మార్పులతో అల్లకల్లోలంగా మారిన భారత జట్టుకి స్థిరత్వం నేర్పించిన సారథి గంగూలీ. అయితే గంగూలీ విజయం వెనక ప్రపంచానికి తెలియని ఓ హస్తం కూడా ఉంది. అదే సచిన్ టెండూల్కర్... 

PREV
112
వైస్ కెప్టెన్‌గా చేయమన్నా, వాళ్లేమో నన్ను పీకేసి... సౌరవ్ గంగూలీతో స్నేహం గురించి టెండూల్కర్..

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ప్లేయర్ల ఎంపిక దగ్గర్నుంచి బౌలింగ్ మార్పుల దాకా చాలా విషయాల్లో కెప్టెన్‌కి అమూల్యమైన సలహాలు ఇచ్చేవాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్. తాజాగా సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, దాదాతో తనకున్న అనుబంధం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు...

212
ganguly sachin

సౌరవ్ గంగూలీ కప్టెన్సీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్‌లను డ్రా చేసుకున్న భారత జట్టు, పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ గెలిచింది. 2002 చాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకతో కలిసి షేర్ చేసుకుంది. 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కి చేరి, రన్నరప్‌గా నిలిచింది... ఈ విజయాలన్నింటిలో సభ్యుడిగా ఉన్నాడు సచిన్ టెండూల్కర్..

312
Sourav Ganguly, Sachin Tendulkar

‘సౌరవ్ ఓ గొప్ప కెప్టెన్. టీమ్‌ని ఎలా బాలెన్స్ చేయాలో అతనికి బాగా తెలుసు. ప్లేయర్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చేవాడు, అలాగే వారికి బాధ్యతలు అప్పగించేవాడు... 

412

గంగూలీ కెప్టెన్సీ తీసుకున్న సమయంలో భారత జట్టు అస్తవ్యస్తంగా ఉంది. అప్పుడు ఓ కొత్త టీమ్‌నే తయారుచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే మేం వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా వంటి టాప్ క్లాస్ ప్లేయర్లను వెతికి పట్టుకున్నాం. వాళ్లు మ్యాచ్ విన్నర్లు... 

512

అయితే ప్రతీ మ్యాచ్ విన్నర్‌కి కెరీర్ ఆరంభంలో సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్, సౌరవ్ ఇచ్చాడు. జట్టులో ఉన్న ప్రతీ ప్లేయర్‌కి తన రోల్‌పై క్లారిటీ ఉండేది. అలాగే సలహాలు, సూచనలు, అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్చ కూడా ఉండేది..

612
Sachin Tendulkar, Sourav Ganguly,

ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లేముందు నేనే కెప్టెన్‌గా ఉన్నా. ఆ సమయంలో సౌరవ్ గంగూలీని వైస్ కెప్టెన్‌గా చేయాల్సిందిగా నేనే సూచించాను. ఎందుకంటే అతని ఆటను నేను ఎంతో దగ్గర్నుంచి గమనించా... 

712

అతని ఆటలో ఓ తెలియని ఫైర్ ఉండేది. అతను టీమ్‌కి పనికి వస్తుందని అనుకున్నా. సౌరవ్‌లో మంచి లీడర్ ఉన్నాడని అనిపించింది. అందుకే అతని పేరును రికమెండ్ చేశా...అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..

812
Sachin-Ganguly

మేం ఎప్పుడూ టీమ్‌కి బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాం. మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలో అది చేశాం. ఆట గురించి తప్ప, మిగిలిన విషయాల గురించి పట్టించుకోలేదు. మేం ఇద్దరం ఓపెనర్లు గెలిపించిన మ్యాచులు ఎన్నో మధురానుభూతులను మిగిల్చాయి...

912
Sachin-Ganguly

1991 టూర్‌లో నేను, సౌరవ్ ఒకే రూమ్‌ని షేర్ చేసుకున్నాం. ఆ సమయంలో అతని కంపెనీ నాకెంతో నచ్చింది. నాకు అతను అండర్ 15 రోజుల నుంచే తెలుసు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు కూడా ఉండేవి కావు. ఎప్పుడో కానీ కలిసివాళ్లం. అయినా మా ఇద్దరి మధ్య బంధం మాత్రం అలాగే కొనసాగింది..

1012

ఓసారి సౌరవ్ పడుకున్నప్పుడు, నేను, జతిన్ పరన్‌జిపే, కేదార్ గాడ్‌బోలే కలిసి అతని రూమ్ నుంచి నీళ్లు నింపేశాం. అతను లేచేసరికి ఏం జరుగుతుందో తెలియక కంగారుపడ్డాను. 

1112

సౌరవ్ లేచేసరికి అతని సూట్‌‌కేస్ నీళ్లల్లో తేలుతోంది.. అయితే ఆ తర్వాత అది మేమే చేశామని తెలుసుకున్నాడు.. ఆ రోజుల్లో స్నేహం అలా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు  భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

1212

వన్డేల్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కలిసి 6609 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టాప్‌లో ఉన్నారు. ఆరంభంలో ఓపెనర్‌గా వచ్చిన సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత తన స్థానాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌కి త్యాగం చేశాడు.. 

click me!

Recommended Stories