ఒకే క్లాస్‌మేట్స్! అతనేమో అంపైర్‌గా, దినేశ్ కార్తీక్ ఇంకా ప్లేయర్‌గా... ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో...

First Published Jul 8, 2022, 2:58 PM IST

తనతో కలిసి చదువుకున్న స్టూడెంట్... టీచర్ అయ్యి వచ్చినా, కొందరు నిత్యవిద్యార్థులు అదే క్లాస్‌లో అక్కడే ఉండిపోతారు... ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో ఇలాంటి అనుభవమే ఎదురైంది ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్‌కి...

Image credit: PTI

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్, భారత జట్టు ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో ఆడాడు. దినేశ్ కార్తీక్‌తో కలిసి ఆ మ్యాచ్‌లో ఆడిన ఇరు జట్ల ప్లేయర్లు అందరూ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశారు.

Image credit: PTI

తాజాగా ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కి ఫీల్డ్ అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్... ఇంగ్లాండ్ జట్టు తరుపున 13 వన్డేలు ఆడాడు. 2004లో టీమిండియా తరుపున లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరుపున మూడో వన్డే ఆడాడు అలెక్స్ వార్ఫ్..

Latest Videos


Image credit: PTI

లార్డ్స్‌లో జరిగిన తన తొలి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన దినేశ్ కార్తీక్, వికెట్ కీపింగ్‌లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాగన్ ఇచ్చిన క్యాచ్‌ని జారవిడిచాడు...

అదే మ్యాచ్‌లో మైకేల్ వాగన్‌ని స్టంపౌట్ చేసిన దినేశ్ కార్తీక్, మరో క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీకి అవకాశం ఇచ్చిన బీసీసీఐ, రెండేళ్ల వరకూ దినేశ్ కార్తీక్‌ని పట్టించుకోలేదు...

121 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 293 వికెట్లు తీసిన అలెక్స్ వార్ఫ్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని 2011లోనే ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా మారాడు. ఇప్పటికే 2 టెస్టులు, 8 వన్డేలు, 27 టీ20 మ్యాచులకు అంపైర్‌గా వ్యవహరించాడు...

తనతో ఆడిన ప్లేయర్, క్రికెట్ నుంచి తప్పుకుని అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే... క్రికెట్ నుంచి తప్పుకోకముందే కామెంటేటర్‌గా ప్రయత్నించి, సూపర్ సక్సెస్ అయిన దినేశ్ కార్తీక్... ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే...

click me!