ఎమ్మెస్ ధోనీ చెప్పిన ఆ ఒక్క మాట, నా జీవితాన్నే మార్చేసింది... టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

First Published Jun 19, 2022, 5:53 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫెయిలైన తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన జట్టులో హార్దిక్ పాండ్యాకి చోటు ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సెలక్టర్లు, హార్ధిక్ పాండ్యాని సెలక్ట్ చేసేందుకు సుముఖంగా లేకపోయినా మెంటర్ ఎమ్మెస్ ధోనీ రికమెండేషన్‌తో టీమిండియాలోకి వచ్చాడు...

ముంబై ఇండియన్స్‌లో పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులోకి వచ్చినా, తన ఆరంగ్రేటం నుంచి ఎమ్మెస్ ధోనీ అండగా నిలిచిన విధానాన్ని చాలా సార్లు చెబుతూ వచ్చాడు హార్ధిక్ పాండ్యా...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, ఎలాంటి అంచనాలు లేని జట్టును తొలి సీజన్‌లోనే టైటిల్ ఛాంపియన్‌గా నిలిపి... క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచాడు...

Latest Videos


Image credit: PTI

కెప్టెన్‌గానే కాకుండా ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటర్‌గా 487 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ను చావుదెబ్బ తీశాడు హార్ధిక్ పాండ్యా...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఆకట్టుకుంటున్న హార్ధిక్ పాండ్యా, 153.94 స్ట్రైయిక్ రేటుతో 117 పరుగులు చేశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన నాలుగో టీ20లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, భారత జట్టు 169 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

‘నా వరకూ నేనెప్పుడూ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ స్టైల్‌ని మార్చుకుంటూ ఉంటాను. నా ఛాతిపైన ఉండే సింబల్‌ కోసమే ఆడతాను. గుజరాత్ టైటాన్స్ అయినా టీమిండియాకి ఆడినా మరింత మెరుగ్గా రాణించడంపైనే ఫోకస్ పెడతా... 

కెరీర్ ఆరంభంలో మాహీ భాయ్ నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. అందులో ఆయన చెప్పిన ఓ సలహా నా ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఒక్కసారి మాహీ దగ్గరికి వెళ్లి, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలో సలహా చెప్పమని అడిగా...

‘‘ఎప్పుడైనా సరే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నీ స్కోరు ఎంత అని ఆలోచించకు, కేవలం టీమ్ గెలవడానికి ఎంత స్కోరు చేయాలని మాత్రమే ఆలోచించు...’’ అని మాహీ భాయ్ చెప్పాడు. ఆ మాట నా బుర్రలో ఉండిపోయింది...

అప్పటి నుంచి టీమ్ అవసరాలకు తగ్గట్టుగా ఆడడం నేర్చుకున్నా. నన్ను నేను మరింత మెరుగ్గా మార్చుకోవడానికి ఈ సలహా ఎంతగానో ఉపయోగపడింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

click me!