తన 22 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ప్రస్తుతం ప్రపంచమే మెచ్చుకునే ప్రముఖ భారత క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2017లో ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఓ ప్రముఖ నటితో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె రాధికా శరత్ కుమార్.
తమిళ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే గత 45 సంవత్సరాలుగా అగ్రశ్రేణి నటిగా రాణిస్తున్నారు రాధిక శరత్‌కుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగ నాయగన్ కమల్, కెప్టెన్ విజయకాంత్, తమిళన్ సత్యరాజ్.. ఇలా తమిళ సినీ పరిశ్రమలో జోడీ కట్టని స్టార్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, తన మనసులోని మాటను ఎలాంటి సంకోచం లేకుండా, బహిరంగంగా చాలా దైర్యంగా మాట్లాడే కొద్ది మంది నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.