నా కెరీర్‌లో ఎన్నో సాధించా, కానీ ఆ రెండు మాత్రం కలగానే మిగిలాయి... లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

First Published May 30, 2021, 6:05 PM IST

సచిన్ టెండూల్కర్... 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు... రెండు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్థమైన క్రికెట్ కెరీర్‌... ఇది ఓ ప్లేయర్ రికార్డు కాదు, ఆల్‌టైం క్రికెట్ వండర్. అయితే సచిన్ టెండూల్కర్ జీవితంలో రెండు కలలు మాత్రం తీరకుండా ఉండిపోయాయట. వాటిని బయటపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్...

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు సాధించి... అత్యధిక శతకాలు, అర్ధశతకాలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో పాటు ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్నాడు.
undefined
‘నా క్రికెట్ జీవితం చాలా సంతృప్తికరంగా గడిచింది. 2011 వన్డే వరల్డ్‌కప్ గెలవడం నా క్రికెట్ లైఫ్‌లో చాలా విలువైన మూమెంట్. అయితే నా జీవితంలో రెండు విషయాలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి.
undefined
‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ నాకు బ్యాటింగ్ హీరో. ఆయనతో కలిసి ఆడాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. అయితే ఆయన రిటైర్ అయిన రెండేళ్లకి నేను ఎంట్రీ ఇవ్వడంతో ఆ కల నెరవేరలేదు.
undefined
అలాగే సర్ వీవిన్ రిచర్డ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆయన బ్యాటింగ్ చూస్తూ పెరిగాను. రిచర్డ్స్‌తో కలిసి కౌంటీ క్రికెట్‌లో ఆడడం నా అదృష్టం. అయితే ఆయనతో కలిసి ప్రత్యర్థిగా మ్యాచులు ఆడాలని అనుకున్న కల మాత్రం కలగానే ఉండిపోయింది...’ అంట చెప్పుకొచ్చాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్.
undefined
2003 వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన సచిన్ టెండూల్కర్, రాజ్యసభ గౌరవ సభ్యుడిగా పనిచేశారు. ‘అర్జున అవార్డు’తో పాటు రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నాడు.
undefined
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత అత్యున్నత్త పురస్కారం ‘భారతరత్న’ అవార్డుతో సచిన్‌ను సత్కరించింది భారత ప్రభుత్వం. 200 టెస్టులు ఆడిన సచిన్, ఎందరో క్రికెటర్లకి రోల్ మోడల్‌గా మిగిలిపోయాడు.
undefined
click me!