మాకు సచిన్ టెండూల్కర్ ఓ ప్లేయర్ కాదు! ఎమోషన్.. రవిచంద్రన్ అశ్విన్ కామెంట్..

First Published | Oct 1, 2023, 11:04 AM IST

90వ దశకంలో పుట్టిన వాళ్లకు ఫెవరెట్ క్రికెటర్ అంటే ఎక్కువగా వినిపించే పేరు సచిన్ టెండూల్కర్. అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి ప్లేయర్లు మంచి క్రేజ్ తెచ్చుకున్నా, సచిన్ టెండూల్కర్ క్రేజ్ ముందు వారంతా జుజుబీ.. యువరాజ్, కోహ్లీ, అశ్విన్ ఇలా ఎందరో కుర్రాళ్లు సచిన్‌ని చూసి బ్యాట్ పట్టినవాళ్లే..
 

Image credit: PTI

24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, 100 సెంచరీలతో 34 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు. అత్యధిక మ్యాచులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక ఫోర్లు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డులన్నీ సచిన్ పేరిటే ఉన్నాయి..

Image credit: PTI

‘90వ దశకంలో పుట్టిన వాల్లందరికీ సచిన్ టెండూల్కర్ కేవలం ప్లేయర్ కాదు, ఆయన ఓ ఎమోషన్. సచిన్ టెండూల్కర్ మాకు దైవంతో సమానం. భారత క్రికెట్‌‌కి సంబంధించిన ఆయనే పోస్టర్ అని హర్షా భోగ్లే చెప్పాడు.. అది సరిగ్గా నిజం..
 

Latest Videos


Image credit: PTI

నా వరకూ సచిన్ టెండూల్కర్ ఓ నమ్మకం. ప్రతీ రోజూ ఉదయాన్ని సచిన్ టెండూల్కర్‌ని చూసి, ఎంతో స్ఫూర్తి పొందుతాను. సచిన్ టెండూల్కర్‌ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీవీలకు అతుక్కుపోయేవాడిని. ఆకలి వేసేది కాదు, దాహం కూడా వేసేది కాదు..

Image credit: PTI

సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉన్నంతవరకూ టీమిండియా గెలుస్తుందనే నమ్మకం, భరోసా ఉండేవి. సచిన్ టెండూల్కర్ కేవలం పోస్టర్ మ్యాన్ మాత్రమే కాదు, మాలా క్రికెటర్ అవ్వాలని అనుకున్నవాళ్లకు సర్వస్వం ఆయనే..

Ravichandran Ashwin

సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతుంటేనే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన క్రికెటర్ మాత్రమే కాదు, ఓ రకంగా క్రికెట్ దేవుడు అనే మాట ఆయనకి సరైనది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. 

Ravichandran Ashwin

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపికైన అక్షర్ పటేల్, ఆసియా కప్ 2023 టోర్నీలో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 

click me!