మ్యాచ్ అయిపోయాక కూడా ధోనీ, రూమ్‌కి వెళ్లనిచ్చేవాడు కాదు... 2011 వరల్డ్ కప్‌పై వీరూ కామెంట్..

First Published | Sep 30, 2023, 6:52 PM IST

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌ టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ ప్లేయర్లలో ఒక్కడైన వీరేంద్ర సెహ్వాగ్, కెరీర్‌కి సరైన వీడ్కోలు మాత్రం దక్కించుకోలేకపోయాడు. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు వీరూ...

‘2011 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే టీమ్ మీటింగ్‌లో న్యూస్ పేపర్లు చదవవద్దని చెప్పేశారు. అంతేకాదు టీవీల్లో వార్తలు కానీ, బయటి వ్యక్తుల మాటలు కానీ అస్సలు పట్టించుకోవద్దని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ ప్లేయర్లలో విపరీతమైన ప్రెషర్ పెంచుతాయి..

ప్రెషర్‌ పెంచే పనులేవీ చేయకూడదని అందరూ నిర్ణయించారు. ఒక్కసారి రూల్ పెడితే, దాన్ని అందరూ తప్పకుండా ఫాలో అయ్యేవారు. అంతేకాకుండా వరల్డ్ కప్ జరిగినంత కాలం మేమంతా కలిసే ఉన్నాం..

Latest Videos


అంటే కలిసే పార్టీలు చేసుకున్నాం, కలిసే ఎక్సర్‌సైజులు చేశాం. అంతెందుకు కలిసి తిన్నాం, కలిసి పడుకోవడానికి వెళ్లాం. మ్యాచ్ అయిన తర్వాత కూడా ఏ ప్లేయర్‌ని వెళ్లకుండా అందరూ కలిసే ఉండేలా ధోనీ, గ్యారీ కిర్‌స్టన్ జాగ్రత్తలు తీసుకున్నారు..

మ్యాచ్ తర్వాత, మ్యాచ్‌కి ముందు కలిసి మాట్లాడుకోవడం జరిగేది. మేమంతా ఎక్కువగా క్రికెట్ గురించే మాట్లాడుకునేవాళ్లం. డిన్నర్ టైం క్రికెట్ స్ట్రాటెజీల గురించి చర్చించుకునేవాళ్లం. నేను కూడా నా సలహాలు ఇచ్చేవాడిని..

2011 వన్డే వరల్డ్ కప్‌ విజయానికి ఇవి కూడా ఓ కారణం. ఎందుకంటే ప్లేయర్లు కలిసి కట్టుగా ఓ జట్టుగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టం. ధోనీ, దానిపైనే చాలా ఫోకస్ పెట్టాడు. మాపైన కూడా ఒత్తిడి ఉండేది..


ఫ్లైయిట్‌లో ఉన్నా, టీమ్ బస్సు నుంచి బయటికి వచ్చినా, హోటల్‌లో మేనేజర్లు, వెయిటర్లు, కనిపించిన ప్రతీ ఒక్కరూ వరల్డ్ కప్ గెలవాలి.. వరల్డ్ కప్ గెలవాలి అని చెప్పేవాళ్లు. ధోనీ ఒక్కటే లైన్ చెప్పేవాడు..

ఫోకస్ ఎప్పుడూ ప్రయత్నం మీద ఉండాలి. మన ప్రయత్నం సరిగ్గా ఉంటే, విజయం అదే వస్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో అదే జరిగింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..  

click me!