నేను శిఖర్ ధావన్‌కి అభిమానిని! అతన్ని మొదటిసారి కలిసినప్పుడు... రోహిత్ శర్మ కామెంట్...

Published : Oct 01, 2023, 09:29 AM IST

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కెప్టెన్‌గా మారిన తర్వాత మూడు ఫార్మాట్లలోనూ చోటు కోల్పోయాడు. 2022 వరకూ వన్డేల్లో కొనసాగుతూ వచ్చిన ధావన్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..

PREV
16
నేను శిఖర్ ధావన్‌కి అభిమానిని! అతన్ని మొదటిసారి కలిసినప్పుడు...  రోహిత్ శర్మ కామెంట్...

శుబ్‌మన్ గిల్, మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సెటిల్ కావడంతో శిఖర్ ధావన్‌కి గేట్లు మూసుకుపోయాయి. 2022 ఏడాదిలో 6 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, 2023లో టీమ్‌లో చోటు కూడా దక్కించుకోలేకపోతున్నాడు..

26
Image credit: Getty

37 ఏళ్ల శిఖర్ ధావన్‌, మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం ఇక అసాధ్యమే. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ గాయపడితే, వన్డేల్లో ఓపెనర్‌గా ఆడేందుకు ఇషాన్ కిషన్ ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరూ గాయపడితే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కి వన్డేల్లో చోటు దక్కొచ్చు..
 

36
Shikhar Dhawan

‘శిఖర్ ధావన్‌కి నేను మొదటి నుంచి అభిమానిని. అతను U19 వరల్డ్ కప్ ఆడినప్పుడు, తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. ఆ టోర్నీలో శిఖర్ ధావన్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలిచాడు..

46
Rohit Sharma - Shikhar Dhawan

శిఖర్ ధావన్‌ని మొదటిసారి కలిసినప్పుడు, అతన్నే చూస్తూ ఉన్నా. ఎందుకంటే అది నాకో ఫ్యాన్ మూమెంట్ లాంటిది. అతనితో నా అనుబంధం చాలా స్పెషల్. మేం కలిసి చాలా మ్యాచులు ఆడాం..

56
Image credit: Getty

గబ్బర్‌లో స్పెషల్ టాలెంట్ ఉందని నమ్ముతాను. గత 15 ఏళ్లలో ఆ టాలెంట్‌ని నిరూపించుకుంటూనే ఉన్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

66

2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన శిఖర్ ధావన్, ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా, అతన్ని తిరిగి టీమ్‌లోకి తీసుకోవడానికి సెలక్టర్లు సిద్ధంగా లేరు.. 

click me!