సిక్స్ సరిపోదు! ఒకే బంతికి 8, 12 పరుగులు... 2002లో సచిన్ టెండూల్కర్‌ ఇన్నింగ్స్‌లో ఇదేలా సాధ్యమైంది...

Published : Dec 21, 2022, 12:47 PM IST

సాధారణంగా క్రికెట్‌లో బౌండరీ లైన్ 60-75 మీటర్ల దూరం ఉంటుంది. 60 కాదు కదా, 120 మీటర్ల దూరం కొట్టినా కూడా అది సిక్సర్‌గా పిలవబడుతుంది. ఓ బాల్‌కి బ్యాట్స్‌మెన్‌కి వచ్చే అత్యధిక పరుగులు ఆరే. అయితే ఒకే బంతికి 12 పరుగులు రావడం ఎప్పుడైనా చూశారా.. అవును! ఇది నిజం. అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఇలా జరిగింది...

PREV
19
సిక్స్ సరిపోదు! ఒకే బంతికి 8, 12 పరుగులు... 2002లో సచిన్ టెండూల్కర్‌ ఇన్నింగ్స్‌లో ఇదేలా సాధ్యమైంది...

సచిన్ టెండూల్కర్ 27 బంతుల్లో 72 పరుగులు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు బాదిన సచిన్ టెండూల్కర్, 267 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. అయితే ఇందులో రెండు 8లు, ఓ 12 పరుగులు ఉండడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు...

29

ఫోర్లు, సిక్సర్లు మాత్రమే తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇంతకుముందు ఓ బంతికి 8 పరుగులు, 12 పరుగులు కూడా ఇచ్చేవాళ్లా? అనే అనుమానం కలుగుతోంది... నిజానికి టెస్టు క్రికెట్ వచ్చినప్పటి నుంచి మాగ్జిమం 6 పరుగులు మాత్రమే ఉండేవి. 8, 12 పరుగులు అనేవి లేవు...

39

అయితే టీ20 ఫార్మాట్‌ రావడానికి ముందు 2002లో ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్ టూర్‌లో 10-10 ఫార్మాట్‌లో ఓ మ్యాచ్ ఆడింది టీమిండియా. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మార్టిన్ క్రో ఈ ప్రయోగాత్మక ఫార్మాట్‌ని కనిపెట్టాడు...

49

పేరుకి 10 ఓవర్ల మ్యాచ్ అయినా ఓవర్‌కి ఆరుకి బదులుగా 8 బంతులు వేస్తారు. అలాగే టెస్టు మ్యాచ్ మాదిరిగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మ్యాచులు సాగుతాయి. అంటే 10 ఓవర్ల చొప్పున తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్న మాట...

59

తుది జట్టులో 13 మంది ప్లేయర్లు ఆడవచ్చు. ఇందులో 3 బ్యాటర్లు, 2 ఇద్దరు ఆల్‌రౌండర్లు. 3 బౌలర్లు, ఓ వికెట్ కీపర్, నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఈ ఫార్మాట్‌లో ఎల్బీడబ్ల్యూ ఉండనే ఉండదు. అంటే వికెట్ల ముందు మోకాళ్లకు తగిలితే ఏ బ్యాటర్ అవుట్ అవ్వడు...

69
Virender Sehwag

నో బాల్ వేస్తే, ఫ్రీ హిట్ ఇస్తారు. ఆ బంతికి రనౌట్ అయితే తప్ప, బ్యాట్స్‌మెన్ మరో విధంగా అవుటయ్యే అవకాశం ఉండదు. అలాగే వైడ్ వేస్తే స్ట్రైయికింగ్‌లో ఉన్న బ్యాటర్‌కి 2 పరుగులు ఇస్తారు. ఐదుగురు బ్యాటర్లకు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఐదుగురు అవుట్ అయితేనే మిగిలినవారికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుంది...

79

అయితే బ్యాట్స్‌మెన్‌కి ముందు ఉండే 30 మీటర్లను మ్యాక్స్ జోన్‌గా పిలుస్తారు. బౌలర్ బంతిని వేసేవరకూ ఈ జోన్‌లో ఏ ఫీల్డర్ కూడా ఫీల్డింగ్ చేయకూడదు. ఈ మ్యాక్స్‌ జోన్‌లో సిక్సర్ కొడితే, అది 12 పరుగులుగా... ఫోర్ కొడితే 8 పరుగులుగా బ్యాట్స్‌మెన్‌ ఖాతాలో చేరతాయి..

89

2002లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఫార్మాట్‌ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే టీ20 ఫార్మాట్‌ రావడానికి ఇదే కారణమైంది. నో బాల్ ఫ్రీ హిట్‌తో పాటు పవర్ ప్లే ఫీల్డింగ్ సెట్టింగ్స్ కూడా మార్టిన్ క్రో ప్రయోగాత్మక సిరీస్ నుంచే తీసుకున్నారు...

99


2002లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన 10-10 ఓవర్ల మ్యాచ్‌లో కివీస్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 123 పరుగులు చేసింది. సచిన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 133 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 118 పరుగులు చేయగా ఆఖరి ఇన్నింగ్స్‌లో సచిన్ 5 పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 87 పరుగులు చేయగలిగింది..
 

click me!

Recommended Stories